నటి ఇంద్రజ ప్రస్తుతం జబర్దస్త్, శ్రీ దేవి డ్రామా కంపెనీ షో లో జడ్జ్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా శ్రీ దేవి డ్రామా కంపెనీ లో ఉమెన్స్ డే స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో ఇంద్రజ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ నెల మార్చి 8న మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా వీర వనితలు వారు చేసిన గొప్ప సాహసాలు గుర్తుచేసుకుంటూ శ్రీదేవి డ్రామా కంపెనీ లో స్పెషల్ ఎపిసోడ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇంద్రజ మహిళల గొప్పతనం గురించి మాట్లాడింది. పైగా మగవారు తిట్టుకుని కొట్టుకునే సమయంలో ఆడదాన్ని మధ్యలోకి ఎందుకు లాగుతారు అని ఆవేదన వ్యక్తం చేసింది. 

తాజాగా విడుదలైన ప్రోమోలో ముఖ్య అతిథిగా శ్రీరామ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. రాంప్రసాద్ తన ఆటో పంచులతో నవ్వులు పూయించాడు. ఇక మానస్ తన డాన్స్ తో అదరగొట్టేశాడు. ఆ తర్వాత రోహిణి, శిల్ప మరో ఇద్దరు అమ్మాయిలు కలిసి స్వతంత్రం కోసం పోరాడిన వీరనారీమణులు గుర్తు చేస్తూ డాన్స్ ప్రదర్శన ఇచ్చారు. దీనికి ఇంద్రజ జడ్జ్ మెంట్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ .. ' ఆడవారికి ప్రాణం పోయడమే కాదు .. అవసరమైతే ప్రాణాలు తీయడం కూడా వచ్చు అని ఇలాంటి మహిళలు నిరూపించారు అని చెప్పింది. 

ఈ నేపథ్యంలో ఆమె మగవారికి ఒక విజ్ఞప్తి చేసింది. దయచేసి మగ వాళ్ళు బూతులు తిట్టుకోవడానికి మమ్మల్ని వాడుకోవద్దు. మీరు కొట్టుకుంటున్నారా .. తిట్టుకుంటున్నారా మీ పేర్లతోనే తిట్టుకోండి అని ఇంద్రజ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంద్రజ మాటలను నెటిజన్లు సమర్థిస్తున్నారు. చాలా కరెక్ట్ గా చెప్పారు అంటూ సపోర్ట్ చేస్తున్నారు. 

ఏ సందర్భంలో ఇంద్రజ ఇలా మాట్లాడారో పూర్తి ఎపిసోడ్ చూస్తే క్లారిటీ వస్తుంది. కాగా ఇది మార్చి 10 ఆదివారం టెలికాస్ట్ కానుంది. ఇంద్రజ ప్రస్తుతం ఇటు బుల్లితెర పై సందడి చేస్తుంది. మరో వైపు సినిమాల్లో నటిస్తూ క్రేజ్ దక్కించుకుంటుంది.