అద్భుత సౌందర్యంతోనే కాక నటనతో చలన చిత్ర పరిశ్రమల్లో మరెవరికీ సాధ్యంకాని తారగా... వెండితెరను తన పాదాక్రాంతం  చేసుకుంది అందాల తార శ్రీదేవి. అయితే దుబయిలోని జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్ రూమ్ నెంబర్ 2201లో అనుమానాస్పదంగా మృతి చెందటంతో శ్రీదేవి మృతిపై మిస్టరీ వీడలేదు.

ఓ పక్క సుదీర్ఘ విచారణ చేపట్టిన అనంతరం ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చిన దుబయి అధికారులు.. కేసు విచారణ ముగిసిందని స్పష్టం చేశారు. దీంతో శ్రీదేవి మృతిపై అనుమానిస్తున్న వాళ్లంతా షాక్ కు గురయ్యారు.

శ్రీదేవి హోటల్ రూమ్ లో అసలు ఏం జరిగింది. శ్రీదేవి మృతి ప్రమాదమా లేక ఆత్మహత్యా లేక హత్యా? మొదట్లో గుండెపోటు అని చెప్పి తర్వాత మార్చుకున్నారు. కానీ పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ రిపోర్టులో మాత్రం బాత్ టబ్ లో చనిపోయిందన్నారు. మరి బాత్ టబ్ లో ఆరోగ్యవంతమైన ఓ స్త్రీ ఇలా విగత జీవిగా మారటం సాధ్యమేనా... మెడికల్ రిపోర్టులో కార్డియాక్ అరెస్ట్ ప్రస్తావన లేకపోవడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.

 

2. బోనీ పాత్రపై పోలీసులు వ్యక్తంచేసిన అనుమానాలు ఏంటి, బోనీ ఒక్కడే ఎందుకు ఇండియా తిరిగొచ్చాడు. శ్రీదేవి ఆ రెండు రోజులు గదిలోంచి బైటికి రాలేదా.. బోనీ సర్ ప్రైజ్ డిన్నర్ కి శ్రీదేవితో కలిసి వెళ్దామనుకున్నాడా.. ఘటన జరిగింది ఆరు గంటల ప్రాంతంలో అని చెప్పారు. మరి పోలీసులు రాత్రి 9 గంటల దాకా ఎందుకు రాలేదు. అసలు రెస్ట్ రూంలోకి వెళ్లిన శ్రీదేవి రాకపోవడంటో తలుపు కొట్టి వెళ్లానని ఎందుకు చెప్పాడు. హోటల్ సిబ్బంది మాత్రం తాము వెళ్లామని ఎందుకు చెప్పారు. అసలు బోనీ తలుపులు కొట్టి వెళ్లాడా.. లేక హోటల్ సిబ్బందా..

 

3. శ్రీదేవి ఆత్మహత్య చేసుకుందా... మొదటి భార్య కుటుంబానికి, శ్రీదేవి కుటుంబానికి వివాదాలు వచ్చి అవమానం పడిందా.. డిప్రెషన్ వల్ల ఆత్మహత్య చేసుకుందా..

4. శ్రీదేవిది హత్యనా... ఆల్కహాల్ అవశేషాలు ఆమె శరీరంలోకి ఎక్కడి నుంచి వచ్చాయి. హార్డ్ డ్రింక్ ఎలా వచ్చింది. ఎవరైనా తాగించారా..

5. శ్రీదేవి పెళ్లిలో అలసిపోయి హోటల్ గదిలోకి వెళ్లాక బాత్ టబ్ లో బ్యాలెన్స్ మేనేజ్ చేయలేక పోయిందా..

6. అందం పట్ల శ్రద్ధతో కాస్మెటిక్ సర్జరీలు చేయించుకున్న నేపథ్యంలో.. డైట్ వికటించి మరణానికి కారణమయ్యాయా..

7. అసలు శ్రీదేవి మరణం సహజమే అయితే.. రూంలో ఏం జరిగింది.

 

ఇక శ్రీదేవి శరీరంలో ఆల్కహాల్ మోతాదు వుందని పేర్కొన్న దుబయి వైద్యులు ఆ ఆల్కహాల్ ఏ మేరకు వుంది.. దానివల్లే శ్రీదేవి బాత్ టబ్ లో మునిగి చనిపోయారా.. లేక తిరిగిరాని లోకాలకు వెళ్లిన శ్రీదేవిపై విష ప్రయోగం ఏదైనా జరిగిందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే శ్రీదేవికి మద్యం అలవాటు లేదని అంటుంటే.. తన శరీరంలో మద్యం ఆనవాళ్లు ఎందుకు వచ్చాయి.. వస్తే ఏ మోతాదులో మద్యం తీసుకుంది.. మద్యం మాత్రమే తీసుకుందా.. ఏదైనా విష ప్రయోగం జరిగిందా అనే అనుమానాలు మాత్రం అలాగే వున్నాయి. మిలియన్ డాలర్ల ప్రశ్నలెన్నో తలెత్తుతున్న శ్రీదేవి డెత్ మిస్టరీలో చివరకు ఏం తేలుతుందో చూడాలి.

 

మేనల్లుడి పెళ్లిలో... బోనీ కపూర్ మొదటి భార్య బంధువుల నుంచి అవమానాలు ఎదుర్కొందని, అందుకే రెండు రోజులపాటు శ్రీదేవి హోటల్ గదిలోంచి బయటికి కూడా రాలేదని.. కూడా వినిపిస్తున్న నేపథ్యంలో శ్రీదేవి ఆత్మహత్య చేసుకుందా లేక ప్రమాదవశాత్తు మరణించిందా అని అనుమానాలు తలెత్తుతున్నాయి. శ్రీదేవి అభిమానులు మాత్రం ఆమె మరణాన్ని జీర్ణించుకకోలేకపోతున్నారు.