ముంబై చేరిన శ్రీదేవి పార్థివ దేహం, రేపు మ.3.30కు అంత్య క్రియలు

ముంబై చేరిన శ్రీదేవి పార్థివ దేహం, రేపు మ.3.30కు అంత్య క్రియలు

అందాలతార శ్రీదేవి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించటంతో ఎంబామింగ్ ప్రక్రియ పూర్తి చేసి ఆమె మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో భారత్ కు తరలించారు. రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో శ్రీదేవి పార్థివ దేహం ముంబై ఎయిర్ పోర్ట్ చేరుకుంది. అక్కడ్నించి శ్రీదేవి నివాసానికి తరలించారు. ఇక శ్రీదేవి  మృతిపై అభిమానుల్లో అనేక సందేహాలున్నా... ప్రస్థుతానికి జరగాల్సిన కార్యక్రమంపై కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన వెలువరించారు.

 

ఇక శ్రీదేవి భౌతిక కాయం ప్రత్యేక అంబులెన్స్ లో.. లోఖండ్ వాలాలోని శ్రీదేవి నివాసమైన గ్రీన్ ఏకర్స్ కు తరలించారు. అనంతరం అభిమానుల సందర్శనార్థం ఉ.8.30 నుంచి ముంబై సెలెబ్రేషన్స్ క్లబ్ లో వుంచుతారు. అనంతరం ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30వరకు సంతాప సభ నిర్వహిస్తారు. అనంతరం మ. 2 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని, ఆ తర్వాత మ.3.30కు పవన్ హన్స్ స్మశాన వాటికలో శ్రీదేవి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన వెలువరించారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos