భాషాభేదాలు లేకుండా భారత చిత్ర పరిశ్రమను ఏలింది లెజెండరీ నటి శ్రీదేవి. సౌత్ నుండి బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ కూడా తిరుగులేని నటిగా దశాబ్దాలు పాటు పరిశ్రమను ఏలారు. ప్రమాదవశాత్తు మరణించే వరకు శ్రీదేవి నటిగా కొనసాగుతూనే ఉన్నారు. శ్రీదేవి నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చింది పెద్ద కూతురు జాన్వీ కపూర్. ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా ఓ స్థాయికి చేరే ప్రయత్నం చేస్తున్నారు. 

చేసింది కొద్ది సినిమాలే అయినా కానీ, ఇప్పటికే తన మార్కు నటనతో వెండి తెరపై ముద్ర వేసింది జాన్వీ. డాన్స్ లలో కూడా జాన్వీ అద్భుతం అనిపిస్తున్నారు. తాజాగా తన ఇంటిలో అద్భుతంగా డాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో పంచుకున్నారు. శుభ్ మంగళ్ సావధాన్ మూవీలోని కన్హా మానే నా.. సాంగ్ కి సాంప్రదాయ డాన్స్ భంగిమలతో ఆకట్టుకున్నారు. జాన్వీ డాన్స్ వీడియో ఆమె ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. 

జాన్వీ డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గ్రీన్ సల్వార్ కుర్తాలో జాన్వీ డాన్స్ చేస్తుండగా చెల్లి ఖుషీ కపూర్ అక్కడే కూర్చొని ఆసక్తిగా చూస్తున్నారు. ధఢక్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ, ఈ మధ్య కార్గిల్ గర్ల్, గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటించి మంచి మార్కులు కొట్టేశారు. ప్రస్తుతం జాన్వీ దోస్తానా 2, రూహి అఫ్జనా చిత్రాలలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.