Asianet News TeluguAsianet News Telugu

శ్రీదేవిలా మరొకరు చనిపోకూడదా..? బోనీకపూర్ కి కౌంటర్!

శ్రీదేవి మృతిని క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నం ‘శ్రీదేవి బంగ్లా’దర్శక,నిర్మాతల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా టీజర్ రిలీజైన నాటి నుంచీ వివాదం ప్రారంభమైంది. మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ నటించిన ‘శ్రీదేవి బంగ్లా’ చిత్రం దర్శక,నిర్మాతలు ఆశించినట్లుగానే సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారుతోంది. 

Sridevi Bunglow director Replay to Boney Kapoor Legal Notice
Author
Hyderabad, First Published Jan 17, 2019, 1:03 PM IST

శ్రీదేవి మృతిని క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నం ‘శ్రీదేవి బంగ్లా’దర్శక,నిర్మాతల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా టీజర్ రిలీజైన నాటి నుంచీ వివాదం ప్రారంభమైంది. మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ నటించిన ‘శ్రీదేవి బంగ్లా’ చిత్రం దర్శక,నిర్మాతలు ఆశించినట్లుగానే సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారుతోంది. 

మళయాళ దర్శకుడు ప్రశాంత్‌ మాంబుల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. స్టార్ హీరోయిన్ గా వెలిగిన  శ్రీదేవి జీవితం నేపథ్యంలో ఉందంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్‌ చిత్ర యూనిట్ కి నోటీసులు కూడా పంపించారు.  ఈ వివాదంపై తాజాగా దర్శకుడు ప్రశాంత్‌ మాంబుల్లి మాట్లాడుతూ.. చేసిన వాదన అభిమానులకు మరింత మండుకొస్తోంది.

డైరక్టర్ మాట్లాడుతూ.. ''నేను శ్రీదేవికి వీరాభిమానిని. ఆమె బాత్‌టబ్‌లో పడి చనిపోయినంత మాత్రాన ఇంకెవ్వరూ అలా చనిపోకూడదని లేదు కదా? మమ్మల్ని సినిమా విడుదల చేసుకోనివ్వండి. బోనీ కపూర్‌ మాకు పంపిన నోటీసులను మేం ధైర్యంగా ఎదుర్కొంటాం. అనుమతి లేకుండా ఒకరిపై బయోపిక్‌ తీయకూడదన్న విషయం మాకూ తెలుసు. 

శ్రీదేవి అనే నటి లండన్‌లో ఎదుర్కొన్న పరిస్థితులేంటి? అన్న నేపథ్యంలో నేను కథ రాసుకున్నాను. అలాగే ఇది క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం. అలాంటప్పుడు సినిమాలోని సస్పెన్స్‌ గురించి ముందే చెప్పలేం. సినిమా గురించి ప్రశ్నిస్తున్నవారందరికీ కథ చెప్పుకొంటూ కూర్చోలేను'' అన్నారు. 

ప్రియా ప్రకాశ్‌ మాట్లాడుతూ.. ''శ్రీదేవి.. ఇది జస్ట్‌ సినిమాలో నా పాత్ర పేరే కదా.. అందులోనూ హీరోయిన్  పాత్ర కావడం కాకతాళీయంగా జరిగిపోయింది. దానికే ఇంత రాద్దాంతం ఎందుకు? ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. కాబట్టి సినిమా శ్రీదేవి నేపథ్యంలో తెరకెక్కించిందా? కాదా? అన్నది ప్రేక్షకులకే వదిలేయాలి'' అని పేర్కొన్నారు. ఇక ‘ఇది శ్రీదేవి సినిమానా కాదా అనే విషయం తెలుసుకోవాలంటే ముందు మీరు సినిమా చూడాలి. ఇందులో నేను శ్రీదేవి అనే సూపర్‌స్టార్‌ పాత్రలో నటిస్తున్నాను’ అన్నారు.

ప్రియా ప్రకాష్ కి బోణీకపూర్ షాక్..!

ప్రియా ప్రకాష్.. 'శ్రీదేవి బంగ్లా' టీజర్!

 

Follow Us:
Download App:
  • android
  • ios