టాలీవుడ్‌లో తెలుగువారికి అవ‌కాశాలు ద‌క్క‌క‌పోవడాని గ‌ల కార‌ణాల‌ను మీడియా వేదిక‌గా బ‌ట్ట‌బ‌య‌లు చేసింది శ్రీ‌రెడ్డి. తెలుగు న‌టీ న‌టులు నిర్మాత‌లతో, డైరెక్ట‌ర్ల‌తో, హీరోల‌తో ప‌డుకోక‌పోవ‌డ‌మే అవ‌కాశాలు రాక‌పోవ‌డానికి కార‌ణ‌మ‌ని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పింది. ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న వారంతా అలా అవ‌కాశాలు చేజిక్కించుకున్న వారేనంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది శ్రీ‌రెడ్డి.

ఇక అస‌లు విష‌యానికొస్తే.. ఇవాళ ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడిన శ్రీ‌రెడ్డి ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు, మ‌హేష్‌బాబుకు అస‌లు పోలికే లేద‌ని తేల్చి చెప్పింది శ్రీ‌రెడ్డి. ప‌వ‌న్ క‌ల్యాణ్ లైఫ్ వేరే.. మ‌హేష్ బాబు లైఫ్ వేరే. ఏపీని ఉద్ద‌రిస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకుని మ‌హిళ‌ల‌కు ఏం సందేశం ఇస్తార‌ని ప్ర‌శ్నించింది. సినిమాల‌కు అవ‌ల‌వాటుప‌డ్డ ప‌వ‌న్ క‌ళ్యాణ్, అచ్చం సినిమాల్లోలాగ‌నే త‌న లైఫ్‌ను ఊహించుకుని నాలుగు పెళ్లిళ్లు చేసుకోవ‌డంతోపాటు రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేశార‌ని ఎద్దేవ చేసింది. మ‌హేష్ బాబుతో పోల్చ‌డానికి కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ అర్హుడు కాద‌ని పేర్కొంది శ్రీ‌రెడ్డి.