సోషల్ మీడియాలో హిరోయిన్ ఎక్స్ పోజింగ్ చేసినవో, కాస్త గ్లామర్ ఒలకబోసిన ఫోటోనో పెడితే.. ఆ పిక్స్ కు రెస్పాన్స్ రకరకాలుగా వస్తుంటుంది. కొందరు అభిమానించే వారు పొగడ్తలతో ముంచెత్తితే... విమర్శలుకు నెగటివ్ కామెంట్లతో వాయించేస్తుంటారు. ఈ విమర్శలు కూడా ఒక్కొక్కరికి ఒక్కోరకంగా వస్తాయి. అదేంటో అర్థం కాదు ముఖ్యంగా తెలుగు అమ్మాయిలు సినీ రంగంలో రాణించాలనుకుంటే.. వాళ్లు చేసే గ్లామర్ షో సరిపోదు సరికదా ఆఖరికి పడుకున్నా గ్యారంటీ లేదని, ఈ విషయంలో దర్శకనిర్మాతల దగ్గర్నించి మొదలుపెడితే కో ఆర్డినేటర్లు కూడా తక్కువేమీ కాదని నటి శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ (పడక సుఖం)పై వర్థమాన నటీమణులు పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నరు. తాజాగా క్యాస్టింగ్ కౌచ్‌ (పడక సుఖం) గురించి వర్థమాన నటి  శ్రీరెడ్డి  పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.  తెలుగు అమ్మాయిలకు హీరోయిన్ ఆఫర్లు ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది.   టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ దారుణంగా ఉందని పేర్కొంది. తెలుగు అమ్మాయిలు దానికి అంగీకరించడం లేదనే అవకాశాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కొంత మంది మెయింటెనెన్స్ కోసం కాస్టింగ్ కౌచ్ బాధితులుగా మారుతున్నారని బాధపడింది.

 

ఒక ప్రాజెక్ట్ అయిపోతే మరో ప్రాజెక్ట్ ఎప్పుడోస్తుందో తెలియదు. వస్తుందా రాదా అనే ప్రశ్నార్థకం. హైదరాబాద్‌లో బతకాలంటే ఎంత ఖర్చు ఉంటుందో తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో నాలాంటి వాళ్ల పరిస్థితి ఏమిటి? వాళ్లు ఎలా జీవించాలి అనే ఆవేదన వ్యక్తం చేశారు. అన్నింటికీ ఒప్పుకున్నా ప్రధానమైన పాత్రలు రావని, ఏదో ఒక పాత్ర చెయ్యమంటారని తెలిపింది. 

 

తెలుగు సినిమాలు 100 బయటకు వస్తే 2 కూడా హిట్ కావడం లేదని, ఒక్క దానిలో కూడా నేటివిటీ ఉండదని తెలిపింది. ఇప్పుడు ఇండస్ట్రీలో సక్సెస్ చూస్తున్నవారు, వెనక నాన్నల పేర్లు తగిలించుకున్న వారందరికీ ముంబై, బెంగళూరు, చెన్నై, కేరళ అమ్మాయిలు కావాలని చెప్పింది. తెలుగమ్మాయిలు ఏం తప్పు చేశారు? వాళ్లు ఫిజిక్ మెయిన్‌ టైన్ చెయ్యడం లేదా? ఎక్స్‌ పోజ్ చెయ్యట్లేదా? హాట్‌ గా లేరా? కోరికలు తీర్చడం లేదా? అని నిలదీసింది. తెలుగమ్మాయిలైతే పడుకునేందుకు కాంప్రమైజ్ కారని తెలిపింది. తీరా దానికి కూడా సిద్ధమంటే చిన్న క్యారెక్టర్ ఇస్తారని పేర్కొంది. తాను గతంలో మీడియాలో పని చేయడం వల్ల ధైర్యంగా చెబుతున్నానని తెలిపింది.

 

అంతేకాదు తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు వాళ్లే హిరోయిన్లుగా వుండేలా నిబంధన విధించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు. పడుకుంటేనే ఆఫర్లు ఇచ్చే.. తెలుగు సినీ పెద్దలను మార్చేందుకు, ఈ పద్ధతిని మార్చేందుకు, చావటానికైనా సిద్ధంగా వున్నానన్నారు శ్రీరెడ్డి. పుత్తడిబొమ్మ పూర్ణమ్మలా.. తాను కూడా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న మహిళలందరి కోసం చావటానికైనా సిద్ధమని, తన చావు నలుగురికి వెలుగవుతుందంటే.. సమిధనవ్వటానికి సిద్ధమని శ్రీ రెడ్డి బావోద్వేగానికి లోనయ్యారు.

 

తనను విమర్శిస్తున్న వాళ్లకు అసలు తెరవెనుక ఎంత బిచ్చింగ్ జరుగుతుందో తెలుసా అని ప్రశ్నించారు. తెలుగమ్మాయి చేస్తే బరితెగింపు, ఇతర భాషల అమ్మాయిలు చేస్తే అందం,చందం ఎలా అవుతుందో అర్థం కావట్లేదని శ్రీరెడ్డి ఆరోపించింది. పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా తన ఇంటర్వ్యూ చూసి నా పేరు చెప్పలేదని సంతోషపడతారంటే ఎవరెవరు ఏం చేస్తున్నారో అర్థం చేసుకోవాలని, పేర్లు చెప్పటం తనకు ఇష్టం లేదని, వాళ్లంతా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీసున దర్శకులని శ్రీరెడ్డి ఆరోపించారు. ఇండస్ట్రీ అంతా చౌదరి డామినేషన్ నడుస్తోందన్నారు శ్రీ రెడ్డి. ఇండస్ట్రీ అంతా కులగజ్జితో నిండిపోయిందన్నారు. సింగర్ గా వృద్ధిలోకి రావాలన్నా... బ్రాహ్మణ సకులంలో పుట్టాలని అన్నారు. జంజం చూసి అవకాశాలిచ్చే సంస్కృతి పోవాలన్నారు. నేను సామాజిక కార్యక్రమాలు చేస్తున్నానంటే.. స్ట్రగుల్ చేయట్లేదని కాదని, నాకు దానం చేసేవాళ్లు చేస్తుంటే దాంట్లోంచి కొంచెం నేను దానం చేస్తున్నానంది శ్రీ రెడ్డి.

 

ఇక ఇతర భాషల హిరోయిన్లు వచ్చి ఎక్స్ పోజింగ్ చేస్తే చూస్తారట కానీ.. తెలుగు అమ్మాయిలు హిరోయిన్లుగా ఎదగటానికి కాస్త గ్లామర్ ప్రదర్శిస్తే మాత్రం.. తప్పట. ఇదెక్కడి భావజాలమో అర్థం కావట్లేదంది శ్రీరెడ్డి. అంతే కాక జిమ్స్ నడిపే ఓ పీతి సింగ్ కు ప్లాపులున్నా అవకాశాలిస్తున్నారుగానీ.. తెలుగు అమ్మాయిలకు మాత్రం టాలెంట్ వున్నా ఛాన్స్ ఇవ్వట్లేదని మండి పడింది శ్రీ రెడ్డి. వాళ్లు ఎక్స్ పోజింగ్ చేస్తే అది, మేం చేస్తే ఇది (శృంగారం, వ్యభిచారం అనేలా) అని వ్యాఖ్యానించింది శ్రీ రెడ్డి.