పవన్ కి నేనేంటో చూపిస్తా

టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో వార్తల్లోకి వచ్చిన వివాదాస్పద నటి శ్రీరెడ్డి.. గతకొంత కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. సోషల్ మీడియా ద్వారా పదునైన కామెంట్స్ విసురుతున్న ఈమె తాజాగా మంగళవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్ ప్రెస్‌ క్లబ్‌లో లాయర్లతో కలిసి మీడియా సమావేసం నిర్వహించారు శ్రీరెడ్డి. నెల రోజులుగా ఉద్యమం చేస్తుంటే ఇండస్ట్రీకి చెందిన ఒక్క హీరో కూడా నా ఉద్యమానికి సపోర్ట్‌‌గా నిలవలేదు. పవన్‌ని తిడితేనే అందరూ బయటికి వచ్చారు మా అసోసియేషన్ ముందు నేను దర్నా చేస్తే నన్ను బ్యాన్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఛాంబర్‌లో హంగామా చేస్తే ఆయన పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు.

పవన్ కళ్యాణ్ రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తారని నేను అనుకోవడం లేదు. పవన్ పేరుతో ఫ్యాన్స్ రౌడీయిజం చేస్తే ఆ నష్టం పవన్ కళ్యాణ్‌కే. చట్టబద్దంగా వెళ్లాలని పవన్ సూచించారు. ఆయన చెప్పినట్టే చట్టాన్ని వాడుకుంటా.. చట్టం ద్వారానే న్యాయం సాధిస్తా.. నా వాడకం అంటే ఎలా ఉంటుందో వారికి చూపిస్తా. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక నుంచి ఉద్యమం తారా స్థాయిలో ఉంటుంది, తెలంగాణ ఉద్యమం స్థాయిలో మహిళా సమస్యలపై ఉద్యమాన్ని ఉదృతం చేస్తా అన్నారు శ్రీరెడ్డి.