శ్రీరెడ్డి, వైవా హర్ష బిగ్ బాస్ హౌస్ లో.. ఇక ఏం జరుగుతుందో!

sri reddy in big boss2 show
Highlights

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని పలువురు హీరోలు, దర్శకనిర్మాతలపై 

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని పలువురు హీరోలు, దర్శకనిర్మాతలపై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచింది శ్రీరెడ్డి. తన అర్ధనగ్న ప్రదర్శనతో నేషనల్ మీడియాలో కూడా కవర్ అయింది. ఇప్పుడు ఆమెను బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ గా ఎంపిక చేశారని టాక్.

ఇక అదే నిజమైతే హౌస్ లో శ్రీరెడ్డి రచ్చ మాములుగా ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ షో అంటేనే వివాదాలకు కేంద్రబిందువు. అలాంటిది సీజన్ 1 మాత్రం ఎలాంటి వివాదాలు లేకుండా సాఫీగా సాగిపోయింది. అయితే ఈసారి ఇంకొంచెం మాసాల అంటూ సీజన్ 2ను మొదలుపెట్టబోతున్నారు. దానికి తగ్గట్లుగానే 16 మంది పోటీదారులను ఎంపిక చేసుకున్నారు. ఇందులో శ్రీరెడ్డి పేరు కూడా ఉందని టాక్.

ఆమెతో పాటు వైవా హర్ష పేరు కూడా వినిపిస్తోంది. ఇటీవల శ్రీరెడ్డి లీక్ చేసిన కొన్ని చాట్ లిస్టులలో వైవా హర్ష చాట్ కూడా ఉంది. అందులో శ్రీరెడ్డిని తన రూమ్ కి రమ్మంటూ హర్ష మెసేజ్ లు చేశాడు. ఈ వివాదం ఇంకా ముగియక ముందే మళ్లీ వీరిద్దరూ 'బిగ్ బాస్2' లో కనిపిస్తుండడం ఆసక్తికరంగా మారింది. జూన్ 10నుండి మొదలుకానున్న ఈ షో వంద రోజుల పాటు సాగనుంది.     

loader