బలవంతంగా పవన్ ను నా చేత తిట్టించారు : శ్రీరెడ్డి

బలవంతంగా పవన్ ను నా చేత తిట్టించారు : శ్రీరెడ్డి

తనను వ్యూహాత్మకంగానే ఛానల్ స్టూడియోకి పిలిచారని.. అడుగడుగునా కెమేరాలు ఏర్పాటు చేశారని.. ఒకవైపు పాతిక మంది.. మరో వైపు ముగ్గురు మాత్రమే ఉండేలా ప్లాన్ చేసినట్లుగా ఆమె చెప్పారు. తమను చర్చకు పిలిచిన ఛానల్.. కొద్ది సమయం ముందే చర్చ ఉందని పిలిచినట్లుగా వెల్లడించిన శ్రీరెడ్డి.. మహా ప్లాన్ వేయటం ద్వారా తనను ఇరికించారన్నారు. తమకు కాస్త ముందుగానే ఈ ప్లాన్ తెలిసి ఉంటే తాము ఒక పదిమందికి చానల్ లో చర్చకు హాజరయ్యే వాళ్లమని చెప్పారు. ముందుగా స్కెచ్ వేసి మరీ చర్చకు పిలిచారని.. తనకు ఆ విషయం తర్వాత కానీ అర్థం కాలేదని ఆరోపించారు.

తన పోరాటాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేసిన వాళ్లంతా తాను ఓడిపోలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కానీ వారి రాజకీయ ఎత్తుగడ కారణంగా  తన పోరాటం దెబ్బ తిన్నదని పేర్కొన్నారు. చూస్తుంటే.. ఛానళ్లకు కాకుండా ఫేస్ బుక్ తో తన తదుపరి పోరాటాన్ని శ్రీరెడ్డి చేపట్టనుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారనుంది. 
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos