ఆ డైరెక్టర్ పై శ్రీరెడ్డి పోలీస్ కంప్లైంట్!

sri reddy files police complaint against kollywood director
Highlights

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వివాదానికి తెరలేపిన నటి శ్రీరెడ్డి పలువురు దర్శకనిర్మాతలు, హీరోలు తనను శారీరకంగా వాడుకొని అవకాశాలు ఇవ్వలేదని ఆరోపించింది

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వివాదానికి తెరలేపిన నటి శ్రీరెడ్డి పలువురు దర్శకనిర్మాతలు, హీరోలు తనను శారీరకంగా వాడుకొని అవకాశాలు ఇవ్వలేదని ఆరోపించింది. టాలీవుడ్ లో ఆమెను ఎవరూ లెక్కచేయడం లేదని ఇప్పుడు కోలీవుడ్ కు వెళ్లింది. లారెన్స్, మురుగదాస్, సుందర్ సి లపై ఆరోపణలు చేసింది.

అయితే ఈ విషయంపై దర్శకుడు వారాహి ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి శ్రీరెడ్డిని వేశ్య అంటూ కామెంట్లు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమెను హెచ్చరించారు. వ్యభిచారం చేస్తూ డబ్బు కోసం కొందరిని మోసం చేస్తుందని ఆమెపై పోలీస్ కంప్లైంట్ చేశారు. వారాహి తనకు ఫోన్ చేసి తనను బెదిరించారని అతడిపై కేసు పెట్టింది శ్రీరెడ్డి. 'సినిమాల్లో అవకాశాలు ఇస్తానని నమ్మించి లైంగిక కోరికలు తీర్చుకుంటున్న వారి బండారాన్ని బయటపెడుతున్నాను.

ఈ క్రమంలో దర్శకుడు వారాహి మీడియా ముందు నన్ను వ్యభిచారిగా చిత్రీకరిస్తూ తప్పుగా మాట్లాడారు. నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఇది నన్ను తీవ్ర మనస్తాపానికి గురి చేస్తోంది. వారిపై లైంగిక వేధింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను' అని ఫిర్యాదులో పేర్కొంది.   

loader