పవన్ కి సంబంధించి ఎవరు ఏ చిన్న విమర్శ చేసినా.. దాన్ని పట్టుకొని నటి శ్రీరెడ్డి చేసే హడావిడి అంతా ఇంతా కాదు. తాజాగా ఆమెకి పవన్ ని విమర్శించే మరో ఛాన్స్ పూనమ్ రూపంలో దొరికింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పూనమ్ కౌర్ ఫోన్ కాల్ అంటూ ఓ ఆడియో టేప్ హల్చల్ చేస్తోంది.

ఇందులో పవన్ ని ప్రస్తావిస్తూ పూనమ్ ఎమోషనల్ గా మాట్లాడింది. పవన్ కోసం ఎన్నో త్యాగాలు చేసినట్లు, పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోతే అతడు తనకు అన్యాయం చేశాడని పూనమ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ వాయిస్ పూనమ్ దేనా లేక మరెవరైనా పవన్ పై బురద చల్లడానికి చేస్తోన్న కుట్ర..? అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది. అయితే ఈ ఆడియో టేప్ లో వినిపిస్తోన్న వాయిస్ పూనమ్ దే అంటూ శ్రీరెడ్డి చెబుతోంది. పూనమ్ మాటలు విని ఏడ్చేశానని.. ఎట్టిపరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ని వదలనని.. అన్ని విషయాల్లో పవన్ విఫలం అయ్యారంటూ ఘాటుగా స్పందించింది.

ఇది ఇలా ఉండగా.. జనసైనికులు మాత్రం ఇది పూనమ్ వాయిస్ కాదని, తెలుగు రాని పూనమ్ ఇంత స్పష్టంగా తెలుగు ఎలా మాట్లాడిందంటూ ప్రశ్నిస్తున్నారు. పవన్ పై కావాలనే కుట్ర చేస్తున్నారని ఈ వ్యవహారాన్ని కొట్టి పారేస్తున్నారు.