ఇటీవల కాలంలో తెలుగు పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన వ్యక్తి హిరోయిన్ శ్రీ రెడ్డి. తాను అవకాశాల కోసం ప్రయత్నించి ప్రయత్నించి విసిగి వేసారి పోయానని, ఇక పెట్టే బేడా సర్దుకుని ముంబైకో లేక చెన్నైకో వెళ్లి తెలుగు ఇండస్ట్రీ పీడ వదిలించుకకోవాలనుకుంటున్నానని శ్రీ రెడ్డి అంటున్నారు. తెలుగు ఇండస్ట్రీ నలుగురు పెద్దల చేతిల్లోనే వుందని, సామాన్య తెలుగు యువతీ యువకులకు అవకాశాలు రావాలంటే.. ఈ బడా కుటుంబాల మాఫియానను అంతం చేయాల్సి వుంటుందని నట్ శ్రీ రెడ్డి ఆరోపించారు. థియేటర్లన్నీ ఆ నలుగురైదుగురు చేతుల్లో వున్నందునే హిట్ సినిమాలు కరువయ్యాయని శ్రీ రెడ్డి ఆరోపించారు.

 

తనకు గతంలో పరిశ్రమకు చెందిన అనేక మందితో స్నేహం, ఎఫైర్స్ వుండేవని శ్రీ రెడ్డి పేర్కొన్నారు. అతే ఎన్ని ఎఫైర్లు నడిపినా అవకాశాలు మాత్రం రాలేదన్నారు శ్రీ రెడ్డి. తనతో చాలా మంది హీరోలకు ఎఫైర్స్ ఆపాదిస్తూ కథనాలు కూడా రాశారన్నారు. ఏకంగా మెగా హీరో అల్లు శిరీష్ తన పుట్టినరోజుకు వచ్చిన పాపానికి.. శిరీష్ ను కూడా తనతో ఎఫైర్ వుందంటూ.. త్వరలో పెళ్లిచేసుకోబోతున్నారంటూ కథనాలు రాయటం ఆశ్చర్యం కలిగించిందని, ఇలాంటివి చదివినప్పుడు నవ్వు రావటానికి తప్ప కడుపు ఆకలి మాత్రం తీరదని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది.

 

నేను ప్రస్థుతం కష్టాల్లో వున్నానని, పరిశ్రమకు చెందిన వారెవరూ తోడుగా లేరని, లైఫ్ అయిపోయిందా.. అసలు ఎందుకు బతకాలో అర్థం కాని పరిస్థితుల్లో వున్నానని, చావాలా, బ్రతకాలా అర్థం కావట్లేదని, ఎన్ని ఎఫైర్స్ నడిపినా ఏమీ లేదని, లిస్ట్ చెప్పనా అయినా లాభం లేదని, ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందని, తనకూ  వస్తుందేమో చూడాలని శ్రీ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.