సురేష్ బాబు కొడుకు ఛాన్స్ ఇప్పిస్తా అన్నాడు.. అందుకే అతనితో పడుకున్నా: శ్రీరెడ్డి

First Published 11, Apr 2018, 1:14 PM IST
Sri reddy about daggupati abhi ram in news channel debate
Highlights
సురేష్ బాబు కొడుకు ఛాన్స్ ఇప్పిస్తా అన్నాడు.. అందుకే అతనితో పడుకున్నా

శ్రీరెడ్డి రచ్చ ఇప్పట్లో ఆగేలా లేదు. రోజురోజుకి ఒకొక్కరి ఫోటోలు వీడియోలు పెట్టి టాలీవుడ్ కి దడ పుట్టిస్తోంది. నిన్న జరిగిన ఒక టీవి ఛానెల్ డిభేట్ లో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కొడుకు అభిరామ్ పేరు...ఫోటోలతో సహా బట్టబయలు చేసింది.  అవకాశం ఇస్తానని ఆశ చూపి... తనను ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడని చెప్పింది. 

దీంతో సదరు టీవీ యాంకర్ ‘‘మీరు పడుకోవడానికి ఒప్పుకోకపోతే... అతను మిమ్మల్ని బలవంత పెట్టేవాడు కాదు కదా! మరి ఎందుకు ‘నో’ చెప్పలేదు...’’ అంటూ శ్రీరెడ్డిని నిలదీసింది. దానికి ‘‘నేను నటిని కావాలనే కోరికతో సినిమాల్లోకి వచ్చాను! టాలీవుడ్ లో టాప్ స్టార్ కావడమే నా కల. దాని కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధమే... అందుకే అతనితో పడుకున్నా.. కాని నన్ను వాడుకుని వాడు అవకాశం ఇవ్వకుండా మోసం చేశాడు...’’ అంటూ చెప్పింది శ్రీరెడ్డి.
 

loader