పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ను కలిశామంటూ శ్రీముఖి, జానీ మాస్టర్‌ సోషల్‌మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తూ ఫొటోలు షేర్ చేసారు. ‘ఏం టైప్‌ చేయాలో తెలియడం లేదు. పవన్‌ కల్యాణ్‌ సర్‌.. లవ్‌.. లవ్‌.. లవ్‌’ అని శ్రీముఖి సంబరపడిపోయారు. పవన్ కళ్యాణ్ క్లీన్ షేవ్‌తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో ప్రక్క పవన్‌ ‘వకీల్‌ సాబ్‌’ సినిమా షూట్‌ బ్రేక్‌లో జనసేన పార్టీ పనులు చూసుకుంటున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు కూడా వైరల్‌ అవుతున్నాయి. ఇక శ్రీముఖి..పవన్ షూటింగ్ లో కనపడటంతో ఆమె ఈ సినిమాలో నటించబోతోందంటూ వార్తలు మొదలయ్యాయి. శ్రీముఖి ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటున్నారు మీడియా జనం. అయితే అసలు నిజం వేరు.

‘వకీల్ సాబ్’ షూటింగ్ జరుగుతున్న స్టూడియోలోనే ‘బొమ్మ అదిరింది’ షో షూటింగ్ కూడా జరుగుతోందని తెలుస్తోంది. దీంతో ఆ షోకు యాంకర్‌గా వ్యవహరిస్తోన్న శ్రీముఖి, న్యాయనిర్ణేతగా ఉన్న జానీ మాస్టర్, కమెడియన్ పొట్టి రియాజ్ పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఆయనతో ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని వినికిడి. 

ఇక త్రివిక్రమ్ తో చేసిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన పవన్‌  కల్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో బోనీ కపూర్‌ సమర్పణలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ‘పింక్‌’ తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందిస్తున్నాడు.  ఈ చిత్రం రిలీజ్ కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం లాక్ డౌన్ వల్ల వెనకబడింది. అయితే ఇప్పుడు మళ్లీ సినిమా ప్రారంభమై పరుగులు పెడుతోంది. ఈ చిత్ర నిర్మాతలు సినిమాని 2021 జనవరి 14న రిలీజ్ చేయటానికి తేదీ ఫిక్స్ చేసిననట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలవడనుంది.  

దాదాపు ఎనిమిది నెలలు విరామం తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ ముఖానికి రంగు వేసుకున్నారు.  ఆదివారం ‘వకీల్ సాబ్’ షూటింగ్‌లో పాల్గొన్నారు.  హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక కోర్టు సెట్‌లో పవన్ కళ్యాణ్‌పై సన్నివేశాలు షూట్ చేస్తున్నట్టు సమాచారం. సినిమాకు కీలకమైన కోర్టు సీన్స్‌ను ఈ షెడ్యూల్‌లో షూట్ చేస్తున్నారట.