మా దేశంలో #LEO రిలీజ్ ఆపమంటూ విజయ్ కి లెటర్
దర్శకుడు లోకేష్ రీసెంట్ గా విక్రమ్ తో బ్లాక్ బస్టర్ అందుకోవడం, అంతకముందు విజయ్ తో మాస్టర్ వంటి సూపర్ హిట్ మూవీ తెరకెక్కించడం, ఆ రెండు చిత్రాలు వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ని కూడా విపరీతంగా అలరించడంతో లియో పై అంతటా అంచనాలు బాగానే ఉన్నాయి.

దళపతి విజయ్ ,సెన్సేషన్ డైరక్టర్ లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొంది ఈ రోజు రిలీజైన అయిన చిత్రం ‘లియో’. ఈ మూవీ పై తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓపినింగ్స్ ఓ రేంజిలో వచ్చాయి. ఇప్పటికే ఓవర్ సీస్ లో షోలు పడి హిట్ టాక్ వచ్చేసింది. ఈ సినిమాకోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విజయ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. దర్శకుడు లోకేష్ రీసెంట్ గా విక్రమ్ తో బ్లాక్ బస్టర్ అందుకోవడం, అంతకముందు విజయ్ తో మాస్టర్ వంటి సూపర్ హిట్ మూవీ తెరకెక్కించడం, ఆ రెండు చిత్రాలు వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ని కూడా విపరీతంగా అలరించడంతో లియో పై అంతటా అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ నేపధ్యంలో తమ దేశంలో సినిమా రిలీజ్ ఆపమంటూ విజయ్ కు లెటర్ వచ్చింది. ఏ దేశం నుంచి అంటే...
శ్రీలంక దేశంలో తమిళులు ఎక్కువగా ఉంటారు. అక్కడ తమిళ సినిమాలకు భారీ మార్కెట్ ఉంది. అయితే అక్కడ ఎంపీలు విజయ్ లెటర్ రాసారు. తాము 20 వ తేదీ అంటే రేపు ఓ ప్రొటెస్ట్ నిర్వహిస్తున్నామని, జనం లియో సినిమా చూస్తూ ఉంటే దానికి దెబ్బ పడుతుందని చెప్పుకొచ్చారు. విజయ్ కు తమ దేశంలో ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అక్కడ ఇరవై తేదీ దాటాక రిలీజ్ చేయమని అడిగారు. ప్రొటెస్ట్ లో విజయ్ అభిమానులు పాల్గొనకుండా సినిమా చూస్తూంటారు అని, అలాగే మీడియా కవరేజ్ సైతం లియో కే ఉంటుంది కాబట్టి విజయ్ కు ఈ ఉత్తరం రాసినట్లు తెలుస్తోంది. అయితే అప్పటికే ప్రింట్స్ వెళ్లిపోవటం, థియేటర్స్ రెడీగా ఉండటం వంటి బిజినెస్ కు ముడిపడిన విషయాలు కావటంతో విజయ్ ఏమీ చేయలేని పరిస్దితి. దాంతో విజయ్ ఏమీ రెస్పాండ్ కాలేదని తమిళ సినిమా వర్గాల సమాచారం.
ఇక లియో తమిళ నిర్మాత లలిత్ కుమార్...హాలీవుడ్ చిత్రం ‘A History of Violence’రైట్స్ ని బారీ రేటుకు తీసుకున్నారని..అందులోని మూలకథను తీసుకుని తమిళ సినిమాకు తగినట్లు మార్పులు చేసి లియోని తెరకెక్కిచారని చెప్తున్నారు డేవిడ్ క్రోనెన్ బర్గ్ దర్శకత్వంలో 2005లో వచ్చిన హాలీవుడ్ సినిమా 'ఏ హిస్టరీ ఆఫ్ వైలెన్స్' కల్ట్ క్లాసిక్ గ్యాంగ్‌స్టర్ సినిమాగా నిలిచింది. అయితే ట్విస్ట్ ఏమిటంటే... ఈ చిత్రాన్ని ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు చూసేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో జగపతి బాబు ప్రధాన పాత్రలో సీన్ టు సీన్ తీశారు. 2010లో గాయం 2 పేరుతో రిలీజైన ఈ చిత్రం ఫరవాలేదనిపించుకుంది. ఇప్పుడు అదే 'ఏ హిస్టరీ ఆఫ్ వైలెన్స్' సినిమాలోని ఓ కోర్ పాయింట్‌ను తీసుకుని దర్శకుడు లోకేశ్ తనదైన స్టైల్లో మార్చి స్క్రిప్టు రాసుకుని డైరెక్ట్ చేశారట. ఎలాగో లోకేశ్ టాలెంట్ ఎలాంటిదో ఇప్పటికే ఖైదీ, మాస్టర్, విక్రమ్ చిత్రాలతో చూశాం. కాబట్టి లియోను కాపీలా కాకుండా అద్భుతంగా తెరకెక్కించే ఉంటారని అభిమానులు ఆశపడుతున్నారు.
'లియో' చిత్రాన్ని సెవెన్ స్కీన్స్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళానిసామి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిషతో పాటు తెలుగులో 'లీడర్' సహా కొన్ని సినిమాలు చేసిన హీరోయిన్ ప్రియా ఆనంద్ కీలక పాత్ర చేశారు. ఇంకా బాలీవుడ్ స్టార్, 'కెజియఫ్'తో విలన్ గా దక్షిణాది ప్రేక్షకుల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న హిందీ హీరో సంజయ్ దత్ ఓ పాత్రలో నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, నటుడు మన్సూర్ అలీ ఖాన్, మలయాళ నటుడు మాథ్యూ తదితరులు ఉన్నారు. ఈ సినిమాకు ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస, కూర్పు : ఫిలోమిన్ రాజ్, కళ : ఎన్. సతీష్ కుమార, యాక్షన్ : అన్బరివ్.