బిగ్ బాస్ హిందీ సీజన్ 12లో కంటెస్టంట్ గా పాల్గొన్న శ్రీశాంత్ తరచూ వివాదాలతో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. శ్రీశాంత్ విన్నర్ అవుతాడని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. నటి దీపికా కాకర్ టైటిల్ కొట్టేసి శ్రీశాంత్ కి షాక్ ఇచ్చింది.

హౌస్ లో ఉన్నంత కాలం వీరిద్దరూ అన్నాచెల్లెళ్ళ మాదిరి అన్యోన్యంగా మెలిగారు. కానీ మధ్యలో విబేధాలు ఎందుకు వచ్చాయో కానీ ఇద్దరి మధ్య రిలేషన్ చెడింది. దీపికా ఇన్స్టాగ్రామ్ ని శ్రీశాంత్ అన్ ఫాలో చేయడంతో విషయం మరింత చర్చకు దారితీసింది.

దీనిపై వివరణ ఇచ్చిన శ్రీశాంత్.. తన భార్యను దీపికా అన్ ఫాలో చేసిందని, ఆ కారణంగానే తాను దీపికాను అన్ ఫాలో చేశానని చెప్పాడు. తన భార్యని గౌరవించలేని వారు.. తనను కూడా గౌరవించలేరని అన్నారు.

దీపికా అభిమానులు తన భార్యా, పిల్లలు అభ్యంతరకర భాషతో దూషిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయంపై దీపికా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఈ విషయాన్ని ఆమెతో డిస్కస్ చేయాలని అనుకోవడం లేదని క్లారిటీ ఇచ్చాడు. దీపిక తనకు సోదరి లాంటిదని చెప్పిన శ్రీశాంత్ ఆ బంధాన్ని గౌరవిస్తానని చెప్పుకొచ్చాడు.