వరుస ప్లాపులతో సతమతమవుతున్న దర్శకుడు శ్రీను వైట్లకు ఊహించని విధంగా ఒక ప్రాజెక్ట్ సెట్టయిన సంగతి తెలిసిందే. ఇక అపజయాలను ఎదుర్కొంటున్న మంచు విష్ణు శ్రీను వైట్లతో ఒక సినిమా చేయబోతున్నట్లు చాలా హ్యాపీగా ఉందని  చెప్పాడు. అయితే అది డీ సినిమాకు సీక్వెల్ అని తెలుస్తోంది. 

2007లో వచ్చిన ఆ సినిమా విష్ణు కెరీర్ మంచి బూస్ట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా కథను కొనసాగించే విధంగా దర్శకుడు రైటర్స్ తో చర్చలు జరుపుతున్నాడు. అలాగే సినిమాలో మరొక హీరో కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. F2 తరహాలో కామెడీ మల్టీస్టారర్ గా సినిమాను తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారు. 

మంచు విష్ణు కూడా సక్సెస్ చూసి చాలా కాలమవుతోంది. ఇక ఈ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునే మరో హీరో ఎవరు? అనే ప్రశ్నకు త్వరలోనే చిత్ర యూనిట్ సమాధానం ఇవ్వనుంది.