శ్రీలీలా ప్రస్తుతం టాలీవుడ్‌లో మారుమోగుతున్న పేరు ఇది. టాప్‌ హీరోల నుంచి యంగ్‌ హీరోల వరకు అందరితోనూ జోడీ కడుతూ రచ్చ లేపుతుంది. వెండితెరపైనే కాదు, ఓటీటీలోనూ ఈ అమ్మడి జోరు కొనసాగుతుంది.

టాలీవుడ్‌లో యంగ్‌ సెన్సేషన్‌గా నిలించింది. శ్రీలీలా. `పెళ్లి సందడి` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ రెండు సినిమాలకే పెద్ద స్టార్‌ ఇమేజ్‌ని, విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. స్టార్‌ హీరోలు సైతం ఎగబడేంత పాపులారిటీని సొంతం చేసుకోవడం విశేషం. దీంతో ఈ అమ్మడి జోరు ఇప్పుడు మామూలుగా లేదు. ఒక్క దెబ్బకి పది సినిమా ఆఫర్లని దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఈ హాట్‌ బ్యూటీ స్పీడ్‌ చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే. కన్నడ నుంచి వచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసే స్థాయికి చేరుకోవడం విశేషం. 

అందులో భాగంగా గతేడాది `ధమాఖా` చిత్రంతోపాటు `ఐ లవ్‌ యూ ఇడియట్‌` అనే ఓ చిన్న సినిమాలో నటించింది శ్రీలీలా. విరాట్‌ ఇందులో హీరోగా నటించగా, ఆయనకు జోడీగా చేసింది శ్రీలీలా. కెరీర్‌ కొత్తలో ఒప్పుకున్న సినిమా ఇది. గతేడాది డిసెంబర్‌ 17న ఇది థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందింది. భవానీ మీడియా సంస్థ ద్వారా `ఆహా`లో ఇది స్ట్రీమింగ్‌ అవుతుంది. ఓటీటీలో ఈ చిత్రం దూసుకుపోతుంది. దుమ్మురేపుతుంది. శ్రీలీలా నటించిన చిత్రం కావడంతో ఆడియెన్స్ విపరీతంగా చూస్తున్నారు. దీనికి లభిస్తున్న ఆదరణ పట్ల టీమ్‌కి ఆశ్చర్యపోతుండటం విశేషం. 

అవిరుద్ర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై శ్రీమతి బత్తుల వసంత సమర్పణలో ఎపి అర్జున్‌ దర్శకత్వంలో సాయి కిరణ్‌ బత్తుల, సుదర్శన్‌ గౌడ్‌ బత్తుల, ఎపి అర్జున్‌ నిర్మాతలుగా ఈ సినిమాని తెరకెక్కించారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అవ్వడం, శ్రీలీల అందాలు, డ్యాన్సులు సినిమాకు ప్లస్‌గా మారాయి. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, విరాట్ యాక్షన్, శ్రీలల లుక్స్ యూత్‌ను ఇట్టే కట్టిపడేశాయి. ఇక ఈ సినిమాలో శ్రీలీల ఆద్యంతం తన అందచెందాలు, నటనతో ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం ఆహాలోనూ అందరినీ మెప్పిస్తోంది. ఆహాలో ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సినిమాకు పూర్ణాచారి పాటలు, హరికృష్ణ సంగీతం, అర్జున్ శెట్టి కెమెరా పనితనం కలిసి వచ్చాయి.

విరాట్‌, శ్రీ లీలా జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: వి. హరికృష్ణ, పాటలు: పూర్ణాచారి, కెమెరా: అర్జున్‌ శెట్టి, ఎడిటర్‌: దీపు ఎస్‌ కుమార్‌, ఆర్ట్‌ : రవి ఎస్‌, ఫైట్స్‌: డా. కె రవి వర్మ, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : సానియా సర్దారియా, నిర్మాతలు : సాయి కిరణ్‌ బత్తుల, సుదర్శన్‌ గౌడ్‌ బత్తుల, రచన - దర్శకత్వం : ఎపి అర్జున్‌. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీలీలా ఓ పది సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అందులో మహేష్‌బాబు `ఎస్‌ఎస్‌ఎంబీ28`, పవన్‌ కళ్యాణ్‌ `ఉస్తాద్‌ భగత్‌సింగ్‌`, బాలయ్య `ఎన్బీకే108`, నవీన్‌ పొలిశెట్టి `అనగనగా ఒక రాజు`, రామ్‌, బోయపాటి శ్రీను సినిమాతోపాటు, నితిన్‌ చిత్రం, కిరీటి `జూనియర్‌` సినిమా, వైష్ణవ్‌ తేజ్‌ మూవీ చేస్తూ బిజీగా ఉంది.