యంగ్‌ సెన్సేషన్‌, క్రేజీ బ్యూటీ శ్రీలీలా బాలయ్యతో చేతులు కలిపింది. ఆయన హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంది. ఈ సందర్బంగా విడుదల చేసిన ఫోటో ఇప్పుడు వైరల్‌ అవుతుంది.

శ్రీలీలా ఇప్పుడు యంగ్‌ సెన్సేషనల్‌గా మారింది. ఆమె జోరు మామూలుగా లేదు. ఒక్క హిట్‌తో ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి వెళ్లిపోయింది. ఇంకా చెప్పాలంటే స్టార్‌ హీరోలందరితోనూ కలిసి నటిస్తుంది. మహేష్‌బాబు, పవన్‌ కళ్యాణ్‌, బాలయ్య సినిమాలు చేస్తుంది. యంగ్‌ హీరోలతోనూ ఆడిపాడబోతుంది. అందులో భాగంగా బాలయ్యతో ఇప్పుడు `ఎన్బీకే108` చిత్రంలో నటిస్తుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంది శ్రీలీలా. చిత్ర బృందం ఈ విషయాన్ని ప్రకటించింది. అంతేకాదు షూటింగ్‌లో జాయిన్‌ అవుతున్నట్టుగా ఓ పిక్‌ని విడుదల చేసింది. 

ఇందులో శ్రీలీలా ఫుల్‌ జోష్‌లో ఉండటం విశేషం. అంతేకాదు బాలయ్య చేతిలో చెయ్యేసి, కన్నుగీటుతో ఆమె సెట్‌లోకి అడుగుపెడుతున్నట్టుగా ఈ ఫోటో ఉండటం మరో విశేషం. ఇందులో శ్రీలీలా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఆమె బాలయ్యకి కూతురు పాత్రని పోషిస్తుందని సమాచారం. ఇక బాలకృష్ణకి జోడీగా కాజల్‌ నటిస్తుంది. కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి దీనికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం గురించి చిత్ర బృందం చెబుతూ, వరుస హిట్లతో దూసుకుపోతున్న నటి శ్రీలీలా ఈ సినిమాలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన సినిమా షూటింగ్‌లో ఆమె జాయిన్‌ అయ్యింది. ఇక్కడ ప్రధాన తారాగణంపై పలు ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. బాలకృష్ణని మునుపెన్నడు చూడని పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో ఆయన లుక్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. బాలయ్య మార్క్ యాక్షన్‌, మాస్‌ ఎలిమెంట్లు, అనిల్‌ రావిపూడి మార్క్ వినోదాత్మక అంశాలు మేళవింపుగా ఈ సినిమా తెరకెక్కుతుంది` అని తెలిపింది యూనిట్‌. 

Scroll to load tweet…

ఇక ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. సి రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటర్‌, రాజీవ్‌ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.వి వెంకట్‌ యాక్షన్‌ పార్ట్ ని కొరియోగ్రఫీ చేస్తున్నారు. సినిమా షూటింగ్‌ `తారకరత్న` అనారోగ్యం కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. తిరిగి ఫిబ్రవరి చివరి వారంలో స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ అంతలోనే తారకరత్న కన్నుమూయడంతో మళ్లీ వాయిదా వేశారు. నేటి నుంచే ఈ చిత్ర షూటింగ్‌ తిరిగి ప్రారంభమైనట్టు టాక్‌. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో బాలయ్య ఢీ కొట్టే విలన్‌గా లేడీ ఆర్టిస్టు నటిస్తున్నారని, బాలీవుడ్‌ ముద్దుగుమ్మ నోరా ఫతేహీ కనిపించబోతుందని సమాచారం.