ప్రభాస్ సరసన శ్రీలీల, డైరక్టర్ ఎవరంటే
అటు సీనియర్ హీరోలు, ఇటు యంగ్ హీరోలు కలిపి ఏకంగా ప్రస్తుతం 9 చిత్రాల్లో నటిస్తోంది శ్రీలీల. ఈ అన్ని సినిమాల్లోనూ ఆమె కీలక పాత్రల్లో నటిస్తోంది. ఇప్పుడు ప్రభాస్ సినిమా కమిటైనట్లు సమాచారం.

కన్నడలో రెండు సినిమాల్లో నటించిన శ్రీలీల తెలుగులో ఏ స్దాయిలో సెట్ అయ్యి పోతుందని ఊహించి ఉండదు. పెళ్లిసందD సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఆమె రెండో మూవీకే మాస్ మహరాజ్ రవితేజ సరసన ధమాకాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా సూపర్ హిట్టవటంలో ఆమెదే ప్రధాన పాత్ర అని ఇండస్ట్రీ మొత్తం హోరెత్తిపోయింది. ఆ సినిమాలో ఆమె నటనకు, స్క్రీన్ ప్రజెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఓవర్ నైట్ లో హ్యాపినింగ్ హీరోయిన్ అయ్యిపోయింది. ధమాకా విడుదలకు ముందే ఆమె ఆరడజను సినిమాలను ఓకే చేసింది. ఆమె చేసిన సినిమాలు వరస రిలీజ్ కు ఉన్నాయి. మరో ప్రక్క మొదట అనుకున్న షెడ్యూల్స్ కు తగినట్లు డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేక చేతులెత్తేస్తోంది. అయితే తాజాగా ఆమె మరో సినిమాకు ఓకే చేసిందని సమాచారం. అయితే ఇప్పుడిప్పుడే ఆ షూట్ మొదలు కాదనే ధైర్యంతో ఓకే చేసిందిట.
శ్రీలల కొత్తగా ఓకే చేసిన ఆ ప్రాజెక్టు హీరో మరెవరో కాదు ప్రభాస్ అంటున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ప్రభాస్ సరసన ఆమెను ఓకే చేసినట్లు సమాచారం. గతేడాది సీతారామంతో మంచి హిట్టు కొట్టిన హను రాఘవపూడితో ప్రభాస్ సినిమా పై ఖచ్చితంగా మంచి అంచనాలే ఉంటాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారు. అఫీషియల్ ప్రకటన రాకపోయినా.. ఇప్పటికే కథా చర్చలు ముగిశాయని సమాచారం. లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్ అయిన హను రాఘవపూడి.. ప్రభాస్ కోసం వేరే తరహా కథా ఎంచుకున్నారని తెలుస్తుంది.
వీళ్ల కాంబోలో తెరకెక్కబోయే సినిమా లవ్‌స్టోరీ కాదని, వరల్డ్ వార్ పీరియడ్ డ్రామా అని చెప్పుకుంటున్నారు. స్క్రిప్టు వర్క్ జరుగుతోందని, వచ్చే సంవత్సరం మొదట్లో షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం హను ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కుతుందట. మరో ప్రక్క శ్రీలల రామ్, బోయపాటి సినిమా స్కంథలో నటించింది. త్వరలో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
అటు సీనియర్ హీరోలు, ఇటు యంగ్ హీరోలు కలిపి ఏకంగా ప్రస్తుతం 9 చిత్రాల్లో నటిస్తోంది శ్రీలీల. ఈ అన్ని సినిమాల్లోనూ ఆమె కీలక పాత్రల్లో నటిస్తోంది. శ్రీలీల ప్రస్తుతం రామ్‌తో 'స్కంద'.. బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న 'భగవంత్ కేసరి'లో కీలక పాత్ర, పంజా వైష్ణవ్ తేజ్‌తో 'ఆదికేశవ్', నితిన్‌తో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్', మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'గుంటూరు కారం'.. అలాగే విజయ్ దేవరకొండ ఓ చిత్రంలో, పవన్ కళ్యాణ్ సరసన 'ఉస్తాద్ భగత్ సింగ్'లో..చిత్రాల్లో నటిస్తోంది.