కిశోర్- కృష్ణ చైతన్యల వివాహానికి సినీ పరిశ్రమ నుంచే కాకుండా మీడియా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
శర్వానంద్ తో ‘శ్రీకారం’వంటి కాన్సెప్టు ఓరియెంటెడ్ సినిమా తీసి హిట్ కొట్టిన సినిమా దర్శకుడు కిశోర్ రెడ్డి. ఆయన ఓ ఇంటివాడయ్యారు. తెలుగు యాంకర్ కృష్ణ చైతన్యను పెళ్లి చేసుకున్నారు. మార్చి 1న తెల్లవారుజామున మూడు గంటల సమయంలో హైదరాబాద్ మామిడిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ వివాహం జరిగింది.
యాంకర్ కేసీగా.. కృష్ణ చైతన్య కొల్ల పాపులర్. ఆమె గతంలో ఆర్జేగా పనిచేసింది. ఆర్జే స్మైలీ క్వీన్ పేరుతో ఆమె రేడియో జాకీగా చేసేవారు. అలాగే అనేక యూట్యూబ్ ఇంటర్వ్యూలతో పాటు సినిమా కార్యక్రమాలకు కూడా ఆమె యాంకర్‌గా వ్యవహరిస్తుంది. కిశోర్- కృష్ణ చైతన్యల వివాహానికి సినీ పరిశ్రమ నుంచే కాకుండా మీడియా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
కిషోర్ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. కాబట్టే ‘శ్రీకారం’ సినిమా ఆలోచన వచ్చిందని చెప్తారు. వ్యవసాయం బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి. క్రికెట్, ప్రేమ లాంటి అంశాల మీద చాలా సినిమాలు వచ్చాయి. అలాగే వ్యవసాయం మీద కూడా వచ్చాయి. కానీ మా సినిమాలో ఎవరూ చెప్పని పాయింట్‌ను టచ్ చేశారు. ఈ పాయింట్‌కు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. మా సినిమాను చూసేందుకు గ్రామాల నుండి ట్రాక్టర్స్‌లో థియేటర్స్‌కు వెళ్ళారు. ఆడియన్స్ అంతా కనెక్ట్ అయ్యారు. ఎమోషన్స్ ఆయన బలం.
2016లో నేను తీసిన ‘శ్రీకారం’ అనే షార్ట్ ఫిల్మ్ చూసారు. దాన్ని చూసి ఇదొక సినిమా కంటెంట్ అని చాలామంది అన్నారు. ఆ తర్వాత 14 రీల్స్ ప్లస్‌లో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లో దర్శకుడిగా కిషోర్ తొలి సినిమా ఉండటం తో మంచి సినిమా అయ్యింది. అలాగే ఈ సినిమా ఫంక్షన్స్‌కు చిరంజీవి , కేటీఆర్ వచ్చారు. ఈ సినిమాను చూసి చాలా మంది అప్పట్లో ఫోన్ చేసి మెచ్చుకున్నారు. దర్శకులు హరీష్‌శంకర్, కృష్ణచైతన్య, సాగర్ కె చంద్ర ఇలా చాలా మంది యంగ్ డైరెక్టర్స్ ఫోన్ చేసి అభినందించారు. అలాగే దర్శకులు అజయ్ భూపతి, బాబీ, గోపీచంద్ మలినేని.. ‘శ్రీకారం’ సినిమాను మీడియా ముఖంగా అభినందించారు.
కిషోర్ రెడ్డి తర్వాత సినిమా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ‘శ్రీకారం’ సినిమాకు కంప్లీట్ డిఫరెంట్. కిషోర్ కు మైథలాజికల్ సినిమాలు అంటే ఇష్టం. భవిష్యత్‌లో అలాంటి సినిమా చేస్తానంటున్నారు.
