యువ హీరో శ్రీ విష్ణు తనదైన శైలిలో డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఓ వర్గం ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇటీవల బ్రోచేవారెవరురా సినిమాతో మరో సక్సెస్ అందుకున్న యువ హీరో ఇప్పుడు మాస్ ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తూ తిప్పరా మీసం అనే సినిమా చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ తోనే సినిమా జనాలను ఎట్రాక్ట్ చేసింది. 

ఇక ఇప్పుడు టీజర్ తో సినిమాపై మరింతగా అంచనాలను పెంచాలని ప్లాన్ చేస్తున్నాడు. రేపు సినిమా టీజర్ ను రాత్రి 8గంటల 10నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు ఎనౌన్స్మెంట్ వచ్చింది. గతంలో ఎప్పుడు లేని విధంగా శ్రీ విష్ణు లుక్స్ తో ప్రయోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్ రెస్పాన్స్ ను బట్టి సినిమా రిలీజ్ పై కూడా చిత్ర యూనిట్ మరో స్పెషల్ అప్డేట్ ను ఇవ్వనుంది. 

నారా రోహిత్ అసురా సినిమాకు దర్శకత్వం వహించిన కృష్ణా విజయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రిజ్వాన్ సినిమాను నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమాతో శ్రీ విష్ణు తన మార్కెట్ ను ఎంతవరకు పెంచుకుంటాడో చూడాలి.