Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో ‘రాజ రాజ చోర’ కలక్షన్స్ పరిస్థితేంటి?

శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘రాజ రాజ చోర..’ సగటు తెలుగు ప్రేక్షకుడి మనసు దోచుకుంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. 

Sree Vishnu Raja Raja Chora performs well in the USA
Author
United States, First Published Aug 23, 2021, 7:52 PM IST

యంగ్ హీరో శ్రీవిష్ణు కెరీర్ పరంగా ఆ మధ్యన వచ్చిన వరస డిజాస్టర్ చిత్రాలతో కాస్తంత వెనకబడ్డాడు. అయితేనేం తను ఆలోచనలో,ప్రాజెక్టు ఎంపికలో వెనకబడలేదని ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నాడు. అందుకు సాక్ష్యం.."బ్రోచేవారెవరురా"..తాజాగా రిలీజన  ‘రాజ రాజ చోర’. హసిత్ గోలి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించాయి. సునయన హీరోయిన్. 

మేఘా ఆకాష్, సునైన హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఆగస్టు 19 న విడుదల అయి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. మొదటి రోజు నుంచి మంచి కలెక్షన్స్ స్టడీగా ఉన్న "రాజ రాజ చోర" తాజాగా ఒక పెద్ద రికార్డును సైతం నమోదు చేసుకుంది. యూఎస్‌లో కొవిడ్ విజృంభిణ కొనసాగుతున్న తరుణంలో రోజుకు సుమారు లక్ష కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ ఈ సినిమాను అమెరికాలోని మన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే.. థియేటర్లకు వెళ్లి మరీ రాజ రాజ చోర సినిమాను చూస్తున్నారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. అమెరికాలో బాక్స్ ఆఫీస్‌ వద్ద మొదటి రోజు 24వేల డాలర్లను (సుమారు రూ.18లక్షలు)ను సాధించింది. దాంతో కరోనా సెకండ్ వేవ్ తర్వాత అమెరికాలో విడుదలై ఎక్కువ కలెక్షన్లు చేసిన తెలుగు సినిమాగా "రాజ రాజ చోర" నిలిచింది. గురువారం విడుదలైన ఈ చిత్రం శనివారం నాటికి అమెరికాలో 106.5 కే డాలర్లు వసూలు చేసి సెకండ్ వేవ్ తర్వాత భారీ కలెక్షన్లు నమోదు చేసిన మొట్టమొదటి తెలుగు చిత్రంగా నిలిచింది. అమెరికాలో మాత్రమే కాక ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా "రాజ రాజ చోర" కలెక్షన్ల వర్షం కురిపిస్తోందని నిర్మాతలు చెప్తున్నారు.  "బ్రోచేవారెవరురా" సినిమా తర్వాత శ్రీ విష్ణు మళ్ళీ ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు.  

నిర్మాత మాట్లాడుతూ...‘‘శ్రీ విష్ణు, హసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది.  ఒక వినూత్నమైన కథతో రూపొందొన మంచి విజయం సాధించింది’’ అని తెలిపారు చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్. తనికెళ్ళ భరణి, రవిబాబు, అజయ్ ఘోష్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : వేదరామన్, సంగీతం : వివేక్ సాగర్, ఎడిటింగ్ : విప్లవ్ నైషధం, ఆర్ట్ : కిరణ్ కుమార్ మన్నె, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : కీర్తి చౌదరి, సహ నిర్మాత : వివేక్ కూచి భొట్ల, నిర్మాతలు : టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, రచన-దర్శకత్వం : హసిత్ గోలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios