Deepavali Movie Review: దీపావళి సినిమా రివ్యూ.. ఎమోషన్స్, సెంటిమెంట్ కలగలిపిన చిత్రం
కొన్ని సినిమాలు స్టార్ లు నటించనక్కర్లేదు.. భారీ బడ్జెట్లు అవకసరం లేదు.. పేరున్న దర్శకులు అవసరం లేదు.. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే చాలు.. కటౌట్ నిలబడి పోతుంది. అలాంటి సినిమానే దిపావళి. ఈమూవీ తాజాగా థియేటర్లను పలుకరించింది. మరి ఈసినిమా ఎలా ఉందో చూద్దాం..

ఈ దీపావళి సందర్భంగా థియేటర్లను పలుకరించింది దీపావళి సినిమా. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ , శ్రీ స్రవంతి మూవీస్ అధినేత 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా కు తెలుగు డబ్బింగ్ మూవీ ఇది. తమిళంలో రవికిషోర్ నటించిన కిడ కు తెలుగు అనువాదం దీపావళి. ఈసినిమా నవంబర్ 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. ప్రేక్షకులకు చూపించడానికి ముందు చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ప్రీమియర్ షోల నుంచి మంచి స్పందన అందుకున్న ఈ సినిమా ఎలా ఉంది? ఏమిటి? అనేది చూస్తే...
ఇక కథ విషయానికి వస్తే..శీనయ్య అనే పెద్దాయన ఓ గ్రామంలో ఉంటాడు..ఆయన కూతురు, అల్లుడు అల్లుడు ప్రమాదంలో మరణిస్తారు. అప్పటి నుంచి మనవడు గణేష్ ని అల్లారు ముద్దుగా ఆ పెద్దవాళ్లు పెంచుకుంటారు. మనవడు అంటే ప్రేమ ఉన్నప్పటికీ..చాలా పేద కుటుంబం కావడంతో అడిగినది కొని ఇవ్వలేని పరిస్థితి శీనయ్య ఉంటాడు. అదే సమయంలో దీపావళి వస్తుంది. ఈ పండక్కి మనవడు కొత్త డ్రస్ కొని ఇవ్వమని అడుగుతాడు.ఎలాగైనా సరే డ్రస్ కొనాలి ని, తన మనవడి కోరిక తీర్చాలని బంధుమిత్రులను బ్రతిమలాడగా.. ఎక్కడా డబ్బు పుట్టదు. సరిగ్గా అదేటైమ్ లో .. దేవుడికి మోక్కిన మేకను అమ్మేయాలని నిర్ణియించుకుంటాడు..
అయితే దేవుడి మేక కావడంతో.. ఎవరూ కొనరు. అయితే ఓ వ్యాక్తి దాన్ని కొనడానికి ముందు వస్తాడు. కాని అదేటైమ్ లో.. ఆమేక తప్పిచుకుంటుంది. ఇంతకీ ఆమేక దొరికిందా.. వారి పేదరికం పరిస్థితులు.. మధ్య లో ఓ ప్రేమకథతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరి మనవడికి శీనయ్య కొత్త డ్రస్ కొన్నాడా? లేదా? వీరాస్వామి కుమారుడి ప్రేమకథ ఏమిటి? అనేది మిగతా సినిమా.. తెరపై చూడాలి.
ఇక సినిమా ఎలా ఉంది అంటే.. దీపావళి సినిమా సమాజంలో జరిగేదే.. సొసైటీకి చాలా దగ్గరగా ..సహజత్వం ఉట్టిపడేలా సినిమాను తెరకెక్కించారు. తెలుగులో వచ్చిన 'బలగం సినిమా మాధిరిగానే స్ట్రాంగ్ ఎమోషన్స్ ను చూపిస్తూ.. సెంటిమెంట్ తో గుండెలోతుల్సి టచ్చేశాడు దర్శకుడు. కమర్షియాలిటీకి చాలా దూరంగా.. అద్భుతమై సినమాను అందించారు. బాల్యంలో తన జీవితంలో జరిగిన సంఘటనలు, తన అమ్మమ్మ - తాతయ్య పడిన మానసిక సంఘర్షణ ఆధారంగా చేసుకుని దర్శకుడు ఆర్ఏ వెంకట్ ఈ 'దీపావళి' చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇక సినిమా అందరిని ఏడిపించేస్తుంది.. స్టార్టింగ్ నుంచి .. చివరి వరకూ.. సహజత్వాన్ని కాస్త కూడా మిస్ అవ్వనీయకుండా.. అద్భుతంగా తెరకెకించారు. ఇక నటీ నటులు పూ రాము, దీపన్ విరుమాండి, కాళీ వెంకట్, అమ్మమ్మ పాత్ర చేసిన మహిళ... ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. సహజంగా పాత్రలను పండించారు. నటించారు. కాళీ వెంకట్ కుమారుడు, ఆయనకు మరదలి పాత్ర చేసిన అమ్మాయి కూడా అద్భుతంగా నటించింద.ి
ఇక టెక్నికల్ టీమ్ గురించి చెప్పనక్కర్లేదు.. సినిమాలో పాటలు బాగున్నాయి. ముఖ్యంగా రెండు పాటలకూ గోసాల రాంబాబు చక్కటి సాహిత్యం అందించారు. థీసన్ సంగీతం పర్వాలేదనిపించింది. . కథకు ఎంత మేరకు అవసరమో... అంత మాత్రమే స్రవంతి' రవికిశోర్ ఖర్చు చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా ప్రారంభమైన కాసేపటికి పల్లె వాతావరణంలోకి తీసుకు వెళ్లడంలో దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యారు.