Asianet News TeluguAsianet News Telugu

‘S.R కళ్యాణ మండపం’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌

థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఎస్‌ఆర్‌. కళ్యాణ మండపం చిత్రాన్ని ఆహా వేదికగా విడుదల చేయనున్నారు. గతకొన్ని రోజుల క్రితం ఈ సినిమా ఓ ప్రముఖ ఓటీటీలో విడుదల కానుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. 

SR Kalyanamandapam Movie OTT Release Date, Digital Rights
Author
Hyderabad, First Published Aug 19, 2021, 7:19 AM IST


"రాజావారు రాణి గారు" అనే సినిమాతో ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన కిరణ్ అబ్బవరం తాజాగా "ఎస్ ఆర్ కళ్యాణమండపం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రియాంక జవాల్కర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. శ్రీధర్ గాదె దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 6 2021 న థియేటర్లలో విడుదలైంది. ధైర్యం చేసి థియేటర్లలో విడుదల చేసినందుకు మంచి వసూళ్లనే రాబట్టింది.  సినిమాకు డివైడ్ టాక్ వచ్చి, రివ్యూలు నెగిటివ్ గా వచ్చినప్పటికీ, కలెక్షన్స్ మాత్రం బాగానే వసూలయ్యాయి. 

తండ్రీకొడుకు సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం విశేషం. సినిమాలోని లిరికల్ సాంగ్స్ యూట్యూబ్‌లో సూపర్ హిట్ కావడం.. ట్రైలర్ కూడా
ఎంటర్టైన్మెంట్ గా ఉండటంతోయూత్ కు సినిమా బాగానే పట్టింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా చాలా చోట్ల సేఫ్ జోన్ లోకి వచ్చేయటం విశేషం. అంతేకాక బ్రేక్ ఈవెన్ కూడా దాటిపోయిందంటున్నారు. అవన్నీ ప్రక్కన పెడితే ఈ సినిమాని థియోటర్ లో చూడని వాళ్లు త్వరలో ఓటీటిలో చూసేందుకు రెడీ అయ్యిపోవచ్చు.  

 త్వరలో ‘S.R కళ్యాణ మండపం’ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫాం ‘ఆహా’ ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. త్వరలో ‘S.R కళ్యాణ మండపం’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ‘ఆహా’ ప్రకటించనుంది. ఈ నెలాఖరులో ఓటీటీ వీక్షకులకు ఈ సినిమా అందుబాటులోకి రానుందనే ప్రచారం జరుగుతోంది.  ఆగస్ట్ 27న ఆహాలో ‘S.R కళ్యాణ మండపం’ విడుదల కానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
ఇతర దక్షిణాది భాషల్లో హిట్ అయిన సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్న ‘ఆహా’ ‘S.R కళ్యాణ మండపం’ చాన్నాళ్ల తర్వాత విడుదలవుతున్న స్ట్రయిట్ మూవీగా చెప్పాలి. థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న రవితేజ ‘క్రాక్’ సినిమా, డైరెక్ట్ ఓటీటీ సినిమా అయిన సుహాస్ ‘కలర్ ఫొటో’ సినిమాలు ‘ఆహా’లో విడుదలై సత్తా చాటాయి. ‘S.R కల్యాణ మండపం’ సినిమాను ఓటీటీలో బాగా ఆదరిస్తారనే అంచనా వేస్తున్నారు. కిరణ్ అబ్బవరమే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, మాటలను అందించాడు. ఇందులో సీనియర్‌ నటుడు సాయికుమార్‌-తులసిలు కీలక పాత్రలు పోషించారు.

Follow Us:
Download App:
  • android
  • ios