Asianet News TeluguAsianet News Telugu

స్పైడర్ నష్టం అంచనా 70 కోట్లు?

  • దసరా కానుకగా రిలీజ్ అయిన స్పైడర్
  • నెగటివ్ టాక్ తో మహేష్ బాబు అభిమానుల అసహనం
  • కలెక్షన్స్ ఇలాగే వుంటే 70 కోట్లు నష్టం వాటిల్లే అవకాశం
spyder loss estimation upto 70 crores

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైడర్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ లెక్కలు కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ట్రేడ్ అనలిస్టుల లెక్కలు, నిర్మాతల లెక్కలు తేడా వస్తుండటంతో ఏది నమ్మాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

 

ఓపెనింగ్స్ బాగానే వచ్చినా రెండోరోజునే డివైడ్ టాక్ తో స్పైడర్ పై తీవ్ర ప్రభావం పడింది. ఇకక మూడో రోజున కూడా శర్వానంద్ మహానుభావుడు విడుదల కావటం, పాజిటివ్ టాక్, రివ్యూలు అనుకూలంగా రావటంతో స్పైడర్ పై మరింత ప్రభావం పడినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే ఎలాగైనా జనాన్ని రప్పించాలనే ఉద్దేశంతోనే పబ్లిసిటీ కోసం నిర్మాతలు స్పైడర్ మూవీ తొలిరోజు రూ.51 కోట్లు వసూళ్లు సాధించినట్లు చెప్తున్నారని, అసలు వసూళ్లు కేవలం రూ.41 కోట్లు మాత్రమేనని తెలుస్తోంది. మహేష్ బాబుకు మాంచి పట్టున్న ఏరియాల్లోనే పరిస్థితి దెబ్బతినటంతో.. ఇలాగే కొనసాగితే మూవీ పరిస్థితి చివరకు ఎటు దారితీస్తుందోనని టాక్ వినిపిస్తోంది.

 

రెండు రోజుల్లో 72 కోట్లు వసూళ్లు సాధించిందని అంటున్నారంటే.. రెండో రోజు 21 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని స్పష్టమవుతోంది. మరి రెండో రోజుకే ఇంత డౌన్ ఫాల్ అవటం దిగ్భ్రాంతి కలిగించే అంశమే. పరిస్థితి ఇలాగే కొనసాగితే కనీసం 70 కోట్ల రూపాయలన్నా నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు అంటున్నారు. మరి స్పైడర్ డిజాస్టర్ గా మిలుగులుతుందా లేక వసూళ్లు సాధించి నిలదొక్కుకుంటుందా చూడాలి. మరో నాలుగు రోజులు సెలవులున్నా... అంతగా పాజిటివ్ టాక్ రాకపోవడం, అటు జై లవకుశ, ఇటు మహానుభావుడు రూపంలో థ్రెట్ కనిపిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios