'అర్జున్ చక్రవర్తి’.. వెండితెరపైకి మరో స్పోర్ట్స్ బయోపిక్.. ఆసక్తి రేకెత్తించేలా ఫస్ట్ లుక్
వెండితెరపైకి మరో స్పోర్ట్స్ బయోపిక్ రాబోతోంది. కబడ్డీ ఆటగాడు ‘అర్జున్ చక్రవర్తి’ నిజజీవితం ఆధారంగా రూపుదిద్దుకుంది. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై ఆకట్టుకుంటోంది. సినిమా డిటేయిల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
బయోపిక్ లకు ఎప్పుడూ ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కుతూనే ఉంటుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ బయోపిక్ చిత్రాలపై ఆడియెన్స్, అభిమానులు ఎంత ప్రేమ చూపిస్తారో తెలిసిందే. ఇప్పటికే ‘ఎంఎస్ ధోనీ’, ‘దంగల్’, ‘800’ వంటి బయోపిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక వెండితెరపైకి మరో స్పోర్ట్స్ బయోపిక్ రాబోతుండటం విశేషం. కబడ్డీ ప్లేయర్ జీవితాన్ని చెప్పేందుకు ’అర్జున్ చక్రవర్తి - జర్నీ ఆఫ్ యాన్ అన్‌సంగ్ ఛాంపియన్‘ (Arjun Chakravarthy) అనే టైటిల్ ను గతంలోనే ప్రకటించారు.
తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ చాలా ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత శ్రీని గుబ్బల నిర్మిస్తున్నారు. నటుడు విజయ రామరాజు (Vijaya Ramaraju), సిజా రోజ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. క్రీడాకారుడి పాత్ర కావడంతో భారీ కసరత్తులు చేసి విజయ రామరాజు తన దేహాన్ని ఎంతో దృఢంగా మలిచారు. అజయ్, దయానంద్ రెడ్డి, అజయ్ ఘోష్ మరియు దుర్గేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ‘అర్జున్ చక్రవర్తి’ చిత్రం 1980లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన కబడ్డీ ఆటగాడి నిజ జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. ఇది ఒక క్రీడాకారుడి జీవితంలోని కష్టాలను, విజయాలను సహజంగా కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ సాగే చిత్రం. ఈరోజు ఈ చిత్రం నుంచి విజయ రామరాజు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.
ఫస్ట్ లుక్‌లో అర్జున్ చక్రవర్తి స్టేడియం మధ్యలో చేతిలో మెడల్ తో, ముఖంలో సంతోషం చూడవచ్చు. పోస్టర్ లో ’భారత కబడ్డీపై అర్జున్ చక్రవర్తి ప్రభావం, 1980లలో భారత క్రికెట్‌పై కపిల్ దేవ్ ప్రభావం స్థాయిలో ఉంటుంది’ అంటూ రాసిన అక్షరాలు సినిమాపై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్ళాయి. అలాగే అర్జున్ స్ఫూర్తిదాయకమైన కథ గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. త్వరలోనే వెండితెరపై ఈ అద్భుతమైన కథ రానుంది. సినిమా కోసం అత్యున్నత సాంకేతిక బృందం పని చేస్తోంది. విఘ్నేష్ బాస్కరన్ సంగీతం సమకూరుస్తుండగా, జగదీష్ చీకాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సుమిత్ పటేల్ ఆర్ట్ డైరెక్షన్, ప్రదీప్ నందన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళంలో బైలింగ్వుల్ గా రూపుదిద్దుకుంది. హిందీ, మలయాళం, కన్నడ లోనూ డబ్ చేసి పాన్-ఇండియా మూవీగా విడుదలకు సిద్ధమవుతోంది.
నిర్మాత శ్రీని గుబ్బల మాట్లాడుతూ, " అర్జున్ చక్రవర్తి అనేది కేవలం సినిమా మాత్రమే కాదు, సవాళ్లను అధిగమించి, మనందరికీ స్ఫూర్తినిచ్చే వ్యక్తులకి నివాళి అన్నారు. వారి పోరాటతత్వం, సంకల్పం, కలల సాధన గురించి తెలిపే కథ. ఈ చిత్రం ద్వారా మేము మానవ సంకల్ప శక్తిని ప్రదర్శించాలనుకుంటున్నామని తెలిపారు. దర్శకుడు విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ.. స్ఫూర్తిదాయకమైన చిత్రానికి దర్శకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. అర్జున్ చక్రవర్తి కథకు జీవం పోసే ప్రయాణం అపురూపమైనది. అర్జున్ చక్రవర్తి పాత్రని విజయ్ రామరాజు నిజంగా అద్భుతంగా పోషించారు.