ఒక రోజు ముందే రిలీజ్ కు రెడీ అయ్యింది స్పైడర్ మ్యాన్(Spider Man) నో వే హోమ్ మూవీ. బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సై అంటుంది హాలీవుడ్ మూవీ.
వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు హై స్పీడ్ మీదొస్తున్నాడు స్పైడర్ మ్యాన్(Spider Man). మంచి సీజన్, భారీగా ఎక్స్ పెక్టేషన్స్ పెరగడంతో.. ఒక రోజు ముందే రిలీజ్ కు రెడీ అయ్యింది "స్పైడర్ మ్యాన్". ముందుగా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 17 మూవీ రిలీజ్ అని ప్రకించిన టీమ్. ఇప్పుడు ఇండియాలో డిసెంబర్ 16న హాలీవుడ్ లో డిసెంబర్ 17న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. 16న ఇండియాలో ఇంగ్లీష్ తో పాటు తెలుగు,తమిళ , హిందీ భాషల్లో సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈసినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ట్రైలర్ తో అన్ని సినిమాల రికార్డ్ లను కొల్లగొట్టిన స్పైడర్... లేటేస్ట్ "నో వే హోమ్" తో ఇంకా ఎన్ని స్టన్నింగ్ స్టంట్స్ చేయబోతున్నాడు.
" జాన్ వాట్స్"(Jon Watts) తెరకెక్కించిన ఈ సినిమాలో టామ్ హోలాండ్ (Tom Holland) జెండయ, బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, జాకబ్ బటలన్, జాన్ ఫెవర్యూ, మరిస టొమి, జె. బీ స్మూవీ, బెనెడిక్ట్ వాంగ్, జామీ ఫాక్స్, ఆల్ఫ్రాడ్ మోలిన, విల్లెమ్ డఫో, థామస్ హడెన్ చర్చ్, రాయిస్ ఇఫాన్స్ ఇలా హాలీవుడ్ దిగ్గజాలంతా ముఖ్య పాత్రలను పోషించారీ మూవీలో. ఇక Spider Man: No Way Home ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. టికెట్లకోసం ఇండియన్ ఫ్యాన్స్ ఆన్ లైన్ లో ఎగబడుతున్నారు.
నో వే హోమ్ తో "Spider Man" ఎప్పుడొస్తాడా అని వెయిట్ చేస్తున్నారు వరల్డ్ వైడ్ ఆడియెన్స్. ఇప్పటిదాకా రిలీజైన 8 స్పైడర్ మూవీస్ లకు మించి అన్నట్టు ట్రైలర్ తోనే ఫ్యాన్స్ ను రెచ్చగొట్టారు మేకర్స్. గత సినిమాల్లోని విలన్లలందరివీ ఇందులో ఇంక్లూడ్ చేయడం, డాక్టర్ స్ట్రేంజ్ స్పైడర్ కోసం రంగంలోకి దిగడం, అన్నింటికి మించి అన్నట్టు స్పైడర్ ఇందులో ట్రిపుల్ రోల్ చేసాడనే టాక్ రావడంతో ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇక స్పైడీ ఫ్యాన్స్ ఊరుకుంటారా... అందేకే ఇదే అదనుగా బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు స్పైడర్ మ్యాన్ దూసుకొస్తున్నాడు.
Also Read: Allu Arjun: బాలయ్యకు అల్లు అర్జున్ పార్టీ.. అల్లు, నందమూరి బంధం బలపడుతోందే
'స్పైడర్ మ్యాన్' సిరీస్ కు ఇండియాలో కూడా సూపర్ క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు వచ్చిన 8 సినిమాలు బాక్సాఫీస్ పై కాసుల వర్షం కురిపించాయి. 2002లో రిలీజైన స్పైడర్ మ్యాన్ నుంచి...2019లో వచ్చిన ఫార్ ఫ్రమ్ హోమ్ వరకు వేల కోట్లు రాబట్టాయి. ఇక ఈ ఇయర్ "మార్వెల్ స్టూడియోస్" నుంచి వచ్చిన బ్లాక్ విడో, షాంగ్ - ఛీ, ఎటర్నల్స్ రికార్డ్ లను కూడా బద్దలు కొట్టాలనేది ఈ కొత్త స్పైడర్ మాస్టర్ ప్లాన్. ఇప్పటికే "Spider Man: No Way Home" ట్రైలర్ కి...హాలీవుడ్ లో ఏ సినిమాకి రాని వ్యూస్ 24గంటల్లో వచ్చాయి. సేమ్ ఇదే స్టామినా కలెక్షన్స్ లోనూ రాబడతామనే ధీమాతో ఉన్నారు మేకర్స్.
గత సిరీస్ లో మంచివాడిగా నటించిన విలన్ మిస్టీరియోను స్పైడర్ మ్యాన్ అంతం చేయడంతో.. ప్రజలంతా స్పైడర్ మ్యాన్ ను శత్రువులా చూస్తారు. అంతేకాదు పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని తెలిసిపోవడంతో సమస్యలు ఎక్కువైనట్టు ‘నో వే హోమ్’ సీరిస్ లో చూపిస్తున్నారు. అందుకే జనాలు పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అనే విషయాన్ని మరిచిపోయేలా చేస్తాడు డాక్టర్ స్ట్రేంజ్. అయితే పీటర్ కోసం పాత శత్రువులు తిరిగి రావడం.. డాక్టర్ స్ట్రేంజ్ సహాయంతో స్పైడర్ మ్యాన్ వారితో ఎలా పోరాడాడనేది తెలుసుకోడానికే ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు.
Also Read: 2021లో ఒక ఊపు ఊపేసిన ఐటెం సాంగ్స్ ఇవే.. 'భూమ్ బద్దల్ నుంచి 'ఊ అంటావా' వరకు
