భారీ అంచనాల మధ్య వచ్చిన 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' అందుకు తగినట్లుగానే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. కరోనా సమయంలోనూ ఎన్నో ఆంక్షల మధ్య విడుదలై వరల్డ్‌వైడ్‌గా సుమారు రూ. 12 వేల కోట్లను కొల్లగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన 6వ సినిమాగా ఈ చిత్రం రికార్డుకెక్కింది.
ఈ మధ్యకాలంలో ఓ రేంజిలో క్రేజ్ తెచ్చుకన్న హాలీవుడ్ చిత్రాలలో స్పైడర్ మ్యాన్ సిరీస్ ఒకటి. స్పైడర్ మ్యాన్ సిరీస్, అమెజింగ్ స్పైడర్ మ్యాన్ సిరీస్, మార్వెల్ స్పైడర్ మ్యాన్ సిరీస్‌ల‍్లోని అన్ని చిత్రాలను ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. రీసెంట్ గా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో వండర్ విజువల్స్‌తో వచ్చిన చిత్రం స్పైడర్ మ్యాన్: నో వే హోమ్. ఈ చిత్రానికి మొదటి నుంచే ఎక్సపెక్టేషన్స్ పెరిగాయి. సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ బజ్ క్రియేట్ చేసింది. టామ్ హాలండ్, జెండయా నటించిన ఈ స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ చిత్రాన్ని అమెరికాలో కంటే ఒకరోజు ముందే భారతదేశంలో విడుదల చేసారు.
ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీ తాజాగా ఓటీటీ బాట పట్టింది. బుక్‌మైషోలో స్పైడర్ మ్యాన్ రిలీజ్ అవుతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. మార్చి 23 నుంచి బుక్ మై షో స్ట్రీమ్‌లో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. హలీవుడ్ స్టార్ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ సిరీస్‌లలోనే ఇది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పాలి. ఎమ్సీయూలో 27వ చిత్రంగా వచ్చిన ఈ మూవీకి జాన్ వాట్స్ దర‍్శకత్వం వహించగా జెండీయా, బెనెడిక్ట్ కంబర్‌బ‍్యాచ్, విలియమ్ డాఫే, జేమీ ఫాక్స్, ఆల్ఫ్రెడ్ మొలీనా కీలక పాత్రలు పోషించారు. ఆండ్య్రూ గ్యారీఫీల్డ్, టోబే మాగ్వైర్లు కూడా స్పైడర్ మ్యాన్ పాత్రల్లో అలరించారు.
ఇక ఈ చిత్రంలో ప్రపంచానికి స్పైడర్ మ్యాన్ ఎవరో తెలిసిపోతుంది. అది సమస్యగా మారుతుంది. దీంతో తాను స్పైడర్ మ్యాన్ అని తెలీకుండా ఉండేందుకు డాక్టర్ స్ట్రేంజ్ సహాయం కోరుతాడు స్పైడీ. ఇందులో నలుగురు విలన‍్లతో స్పైడీ పోరాడతాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' అందుకు తగినట్లుగానే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. కరోనా సమయంలోనూ ఎన్నో ఆంక్షల మధ్య విడుదలై వరల్డ్‌వైడ్‌గా సుమారు రూ. 12 వేల కోట్లను కొల్లగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన 6వ సినిమాగా ఈ చిత్రం రికార్డుకెక్కింది.
