సమరసింహారెడ్డి, ‘నరసింహనాయుడు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తరువాత బాలయ్య నటించిన మరో ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘చెన్నకేశవరెడ్డి’. చెన్నకేశవరెడ్డిగా, భరత్‌గా బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో భాక్సాఫీస్ వద్ద అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు.
అభిమానులందు బాలయ్య అభిమానులు వేరయ్యా...వాళ్లు తమ అభిమాన హీరో చిత్రం ఎన్ని సార్లు అయినా థియోటర్ లో చూడాలనుకుంటారు. ఓటీటి, టీవిల్లో చూస్తే కిక్ ఇవ్వదు అంటారు. అంతేకాదు బాలయ్య పాత చిత్రాల షోలును థియోటర్స్ లో వేసుకుని ఎంజాయ్ చేస్తూంటారు. ఇప్పుడు చెన్న కేశవరెడ్డి వంతు వచ్చింది. ఈ సినిమా 19 సంవత్సరాలు పూర్తైన సందర్బంగా స్పెషల్ షోను వేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి ధియోటర్ లో సెప్టెంబర్ 25 వ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు దేవి థియోటర్ లో స్పెషల్ షో ప్రదర్శన జరగనుంది. దేవి థియోటర్ హైదరాబాద్ లో ఉన్న హైయిస్ట్ కెపాసిటీ ఉన్న సింగిల్ స్క్రీన్స్ లో ఒకటి. దాంతో ఈ షో కోసం అభిమానులు అప్పుడే టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు సిద్దపడుతున్నారు. త్వరలోనే బుక్కింగ్స్ ఓపెన్ కానున్నాయి. వివి వినాయిక్ ని కూడా ఈ షోకు ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది.
చిత్రం విషయానికి వస్తే... ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ. ‘సమరసింహారెడ్డి, ‘నరసింహనాయుడు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తరువాత బాలయ్య నటించిన మరో ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘చెన్నకేశవరెడ్డి’. చెన్నకేశవరెడ్డిగా, భరత్‌గా బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో భాక్సాఫీస్ వద్ద అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు.
ఈ విషయం వినాయిక్ ని బాగా బాధించింది. కానీ బాలయ్య పట్టించుకోలేదట. ఆ విషయం రాజమౌళి ఓ సారి మీడియాతో షేర్ చేసుకున్నారు. రాజమౌళి మాట్లాడుతూ.. ‘చెన్నకేశవరెడ్డి సినిమా టైంలో దర్శకుడు వివి వినాయక్ టైం సరిపోక ఒక సాంగ్‌ని షూట్ చేయలేదు. సినిమా విడుదలైన తరువాత రిజల్ట్‌ని బట్టి సాంగ్ యాడ్ చేద్దాం అని అనుకున్నారు. నిజానికి ఆ సినిమాకి ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చాయి కానీ.. వినాయక్ గారు ఆశించనట్టుగా ఔట్ పుట్ రాలేదు. దీంతో ఆయన డిజప్పాయింట్‌గా ఉండి.. యాడ్ చేద్దాం అనుకున్న సాంగ్ షూట్ చాలా డల్‌గా చేస్తున్నారు. అప్పుడు బాలకృష్ణ గారు పిలిచి వినాయక్ గారు రిజల్ట్ ఆశించడంలో తప్పులేదు కానీ.. దానిపై ఆశలు పెంచుకోకూడదు. మీరు 100 % కష్టపడ్డారు.. నేను ఎంజాయ్ చేస్తూ చేశా.. మిమ్మల్ని నమ్మి ఈ సబ్జెక్ట్ చేశా.. ఈ సినిమా రిజల్ట్ తరువాత మీపైన అదే గౌరవం.. అదే నమ్మకం ఉంది. మీరు బాధపడొద్దు.. మీరు నాతో మళ్లీ సినిమా చేయాలంటే కథ చెప్పండి చేద్దాం.. అంతే తప్ప బాధ పడొద్దని చెప్పారట. ఈ విషయాన్ని వినాయక్ చాలా ఎమోషనల్‌గా చెప్పారు.
శ్రియా శరన్, టబు హీరోయిన్స్ గా నటించారు. దేవయాని, పృథ్వీరాజ్, చలపతిరావు, జయప్రకాశ్ రెడ్డి, ఆనంద్ రాజ్, బ్రహ్మానందం, అలీ, అన్నపూర్ణ, దేవన్, ఎల్.బి.శ్రీరామ్, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. మణిశర్మ స్వరసారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. “హాయి హాయి”, “నీ కొప్పులో”, “ఏం పిల్ల కుశలమా”, “బకరా బకరా”, “తెలుపు తెలుపు”, ‘డోంట్ కేర్”… ఇలా అన్ని పాటలు శ్రోతలను అలరించాయి. ‘ఆది’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత దర్శకుడు వి.వి.వినాయక్, నిర్మాత బెల్లంకొండ సురేష్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్… ఫ్యాక్షన్ చిత్రాలను మరో స్థాయికి తీసుకువెళ్ళిందని ఫ్యాన్స్ అంటారు.
