నందమూరి అభిమానులు సినిమా ప్రీ రిలీజ్ కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అక్టోబర్ 5న హైదరాబాద్ లోని నోవోటోల్ లో వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. అయితే ఈ వేడుకకు ఇద్దరు ప్రముఖులు రానున్నట్లు తెలుస్తోంది. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అరవింద సమేత. అక్టోబర్ 11న రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే నందమూరి అభిమానులు సినిమా ప్రీ రిలీజ్ కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అక్టోబర్ 5న హైదరాబాద్ లోని నోవోటోల్ లో వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. 

అయితే ఈ వేడుకకు ఇద్దరు ప్రముఖులు రానున్నట్లు తెలుస్తోంది. ముందుగా బాలకృష్ణ తండ్రి స్థానంలో ఉండి యంగ్ టైగర్ సినిమా కోసం వస్తాడని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు చంద్రబాబు కూడా ప్రీ రిలీజ్ వేడుకకు రావచ్చని సమాచారం అందుతోంది. హరికృష్ణ మరణించినప్పుడు చంద్రబాబు తారక్ కుటుంబానికి తోడుగా ఉన్నారు. జరగాల్సిన కార్యక్రమాలను ముందుండి జరిపించారు. 

అయితే ఇప్పుడు సినిమా పరంగా కూడా బాబాయ్ మామయ్యలు తారక్ కు మద్దతు ఇస్తున్నారు. తప్పకుండా కుటుంబంలోని ప్రముఖులు వేడుకకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.