సినీ పరిశ్రమలో స్పెషల్ ఎఫెక్ట్స్ కింగ్ గా పేరు సంపాదించుకున్న ప్రముఖ టెక్నీషియన్ ఏక్‌నాథ్‌ (70) మృతి చెందారు. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ఈయన 55 ఏళ్ల క్రితమే సినీ పరిశ్రమలో పని చేయడానికి మద్రాస్ వెళ్లిపోయారు.

ప్రముఖ కెమెరామెన్ మోహనకృష్ణకి ఏక్‌నాథ్‌ సోదరుడు. ఈయన అమితాబ్, ఎన్టీఆర్, రజినీకాంత్, కమల్ హాసన్ ఇలా చాలా మంది అగ్ర హీరోల సినిమాలకు పని చేశారు. కంప్యూటర్ వాడకం లేని రోజుల్లోనే స్పెషల్ ఎఫెక్ట్స్ సృష్టికర్తగా పేరు సంపాదించాడు.

'విఠలాచార్య' సినిమాలో అధ్బుత టెక్నాలజీ వాడారు. ఎన్నో త్రీడీ చిత్రాలకు స్పెషల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ గా పని చేసిన ఆయన తన కెరీర్ లో 700 చిత్రాలకు స్పెషల్ ఎఫెక్ట్స్ సమకూర్చారు.