నెల రోజులు పాటు బ్యాంక్ కు వెళ్లనున్న మహేష్!
హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలో బ్యాంకు సెట్టు వేస్తునట్టు తెలుస్తోంది. ఇప్పటికే సెట్ వర్క్ ప్రారంభించారని సమాచారం. పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
మహేష్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. కుటుంబ విలువలు, వినోదం, ప్రేమ అంశాల మేళవింపుతో ఈ సినిమా రూపుదిద్దుకోనున్నది. ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం కోసం బ్యాంక్ సెట్ ని రెడీ చేస్తున్నారు. ఈ సెట్ లో నెల రోజులు పాటు షూటింగ్ జరగనుంది.
అందుతున్న సమాచారం మేరకు ‘సర్కారువారి పాట’లో మహేశ్‌బాబు బ్యాంక్ ఉద్యోగి పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో బ్యాంక్ సెట్ వేస్తున్నారని సమాచారం. ఈ సెట్‌లో నెల రోజుల చిత్రీకరణ ప్లాన్ చేశారట. వచ్చే నెల ఈ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాసం ఉంది. ముందు అమెరికా షెడ్యూల్ జరిపి, ఆ తర్వాత ఇక్కడ షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ కరోనా వల్ల ప్లానింగ్ మొత్తం మారింది. ముందు ఈ సెట్‌లో షూట్ చేసి, మార్చిలో అమెరికా షెడ్యూల్ ప్రారంభించాలనుకుంటున్నారు.
ఈ సినిమా కాన్సెప్ట్ కూడా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూనే సాగనుంది. ఇక ఈ సినిమాలో మంచి యాక్షన్ తో పాటు థ్రిల్లింగ్ ట్విస్ట్ లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అందుకు తగ్గట్లే గీతా గోవిందం స్దాయిలో.... అలాగే ఓ రొమాన్స్ ట్రాక్ కూడా ఉందని.. మహేష్ అభిమానులకు ఈ లవ్ స్టోరీ బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ అంటున్నారు. చాలా కాలం తర్వాత మహేష్ ఈ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించబోతున్నాడు. ఈ లవర్ బాయ్ లుక్ కోసమే, మహేష్ తన హెయిర్ స్టైల్ ను కూడా కొత్తగా మార్చుకున్న విషయం తెలిసిందే.