Asianet News TeluguAsianet News Telugu

బాలుకి ప్లాస్మా ట్రీట్‌మెంట్‌ .. ఆందోళనలో అభిమానులు

ప్రస్తుతం ఎస్పీ బాలసుబ్రమణ్యంకి ప్లాస్మా ట్రీట్‌ మెంట్‌ ఇస్తున్నారట. కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మా తీసి ప్లాస్మా థెరపీ పద్ధతిలో బాలుకి ట్రీట్‌మెంట్‌ చేస్తున్నట్టు వైద్య వర్గాలు తెలిపాయి. కరోనాకు ప్లాస్మా అనేది ఫైనల్‌ ట్రీట్‌మెంట్‌. దీనితో చాలా వరకు కోలుకునే ఛాన్స్ ఉంటుంది.

sp balasubramanian is undergoing corona treatment with plasma
Author
Hyderabad, First Published Aug 16, 2020, 9:19 AM IST

ప్రముఖ గాయకుడు బాలసుబ్రమణ్యం గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ స్పందించి నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు చికిత్స అందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి శనివారం సాయంత్రం ఒక బులెటిన్‌ విడుదల చేసింది. వెంటిలేటర్‌ అమర్చిన స్థితిలోనే వైద్యుల బృందం బాలుకు చికిత్స అందిస్తోందని పేర్కొంది.  

ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయులో ఆయనకు ట్రీట్‌మెంట్‌ జరుగుతుంది. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతున్నట్టు ఎంజీఎం ప్రకటించింది. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయనకు ప్లాస్మా ట్రీట్‌ మెంట్‌ ఇస్తున్నారట. కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మా తీసి ప్లాస్మా థెరపీ పద్ధతిలో బాలుకి ట్రీట్‌మెంట్‌ చేస్తున్నట్టు వైద్య వర్గాలు తెలిపాయి. కరోనాకు ప్లాస్మా అనేది ఫైనల్‌ ట్రీట్‌మెంట్‌. దీనితో చాలా వరకు కోలుకునే ఛాన్స్ ఉంటుంది. మరి బాలు విషయంలో ఏం జరుగుతుందో అనేది ఉత్కంఠకు గురి చేస్తుంది. మరోవైపు ఆయన త్వరగా కోలుకోవాలని సినీ వర్గాలు, అభిమానులు వేడుకుంటున్నారు.

ఏస్పీ బాలసుబ్రహ్మణ్యం వైద్య ఖర్చులు తామే భరిస్తామని తమిళనాడు ప్రభుత్వం చెప్పింది. తమిళనాడు ఆరోగ్య మంత్రి బాలు ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios