ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన తల్లి శకుంతలమ్మ(89) నెల్లూరులో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం 7 గంటలకుమరణించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యంలండన్ లో ఉన్నారు. తల్లి మరణవార్త తెలియడంతో ఆయన అక్కడ నుండి బయలుదేరారు. రేపు నెల్లూరులో అంత్యక్రియలు జరగనున్నాయి. విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.