Asianet News TeluguAsianet News Telugu

ఎస్పీ బాలసుబ్రమణ్యం బయోపిక్‌,ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్

సినీ పరిశ్రమలో బయోపిక్ ల సీజన్ నడుస్తోంది. సినిమా నటులు, రాజకీయ నాయకులు,స్పోర్ట్స్ స్టార్స్ ఇలా వివిధ వర్గాలకు చెందిన వారి జీవిత చరిత్రలను సినిమాలుగా తెరకెక్కించటానికి సినిమా జనం ఉత్సాహం చూపుతున్నారు. అయితే బయోపిక్ లను భక్తిగా..ప్రత్యేక వ్యక్తుల మీద అభిమానంతో తీసే వారు వేరు. ఇప్పుడు అలాగే ఈ మధ్యనే స్వర్గస్తులైన ఎస్పీ బాలసుబ్రమణ్యం బయోపిక్‌ తీయటానికి చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఆయన కుటుంబం కనుక ఒప్పుకుంటే ఆయన జీవిత చరిత్రను తెరకెక్కిస్తానని ప్రముఖ ఇండస్ట్రలియస్ట్ అన్నారు. 25 వేల పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా మన మధ్య లేకపోయినా..పాటల రూపంలో ఇక్కడే ఉన్నారు.అభిమానులు లక్షల్లో ఉన్నారు.
 

SP Balasubrahmanyam Biopic on cards jsp
Author
Hyderabad, First Published Mar 2, 2021, 8:53 AM IST

సినీ పరిశ్రమలో బయోపిక్ ల సీజన్ నడుస్తోంది. సినిమా నటులు, రాజకీయ నాయకులు,స్పోర్ట్స్ స్టార్స్ ఇలా వివిధ వర్గాలకు చెందిన వారి జీవిత చరిత్రలను సినిమాలుగా తెరకెక్కించటానికి సినిమా జనం ఉత్సాహం చూపుతున్నారు. అయితే బయోపిక్ లను భక్తిగా..ప్రత్యేక వ్యక్తుల మీద అభిమానంతో తీసే వారు వేరు. ఇప్పుడు అలాగే ఈ మధ్యనే స్వర్గస్తులైన ఎస్పీ బాలసుబ్రమణ్యం బయోపిక్‌ తీయటానికి చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఆయన కుటుంబం కనుక ఒప్పుకుంటే ఆయన జీవిత చరిత్రను తెరకెక్కిస్తానని ప్రముఖ ఇండస్ట్రలియస్ట్ అన్నారు.25 వేల పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా మన మధ్య లేకపోయినా..పాటల రూపంలో ఇక్కడే ఉన్నారు.అభిమానులు లక్షల్లో ఉన్నారు.

భగవంతుడు సాక్షాత్తూ మానవాళికి ఇచ్చిన ఓ గొప్ప వరం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్‌. ఈనెల 27 వ తేదీన దివంగత గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి నివాళిగా శుభోదయం గ్రూప్‌ స్పాన్సర్‌ ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించింది. ఘంటసాల , బాలసుబ్రహ్మణ్యం ఇద్దరు సంగీత ప్రపంచానికి సూర్యచంద్రులాంటి వారని శుభోదయం గ్రూప్‌ ఛైర్మన్‌ లక్ష్మీప్రసాద్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మందికిపైగా సింగర్స్‌ పాల్గొన్నారు. మద్రాసు నుండి ఎంతోమంది సంగీత విద్వాంసులు వచ్చారు.  
  
ఈ వేదికపై ఎస్పీబి  కుటుంబం అంగీకరిస్తే బాలు జీవితం ఆధారంగా సినిమా తీస్తానని శుభోదయం గ్రూపు చైర్మన్ శ్రీలక్ష్మీ ప్రసాద్ ప్రకటించాడు. మార్చ్ 1న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి నివాళిగా 60 మంది గాయకులతో ఈయన ఓ కార్యక్రమం నిర్వహించారు. దీనికి హృదయాంజలి అనే పేరు పెట్టారు. ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ ఆధ్వర్వంలో ‘హృదయాంజలి’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 60 మంది గాయకులు బాలుకు నివాళిగా పాటలు పాడారు. 

ఈ కార్యక్రమం తమకు చాలా ప్రత్యేకమని చెప్పాడు లక్ష్మీ ప్రసాద్. ఎస్పీబీకి హృదయాంతరాళాల నుంచి అంజలి ఘటించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి హృదయాంజలి అనే పేరు పెట్టినట్లు ఆయన తెలిపారు. బాలు ఎక్కడున్నా ఈ కార్యక్రమం చూసి పులకరించి ఉంటారని.. ఆయనను చేరే మార్గం పాట ఒక్కటేనని లక్ష్మీ ప్రసాద్ చెప్పుకొచ్చాడు. ఆయన బయోపిక్ తనకు తీయాలని ఉందని.. కాకపోతే దానికి తన ఒక్కడి నిర్ణయం సరిపోదని చెప్పాడు లక్ష్మీప్రసాద్. ఎస్పీ బాలు కుటుంబం కూడా అంగీకరిస్తే వెంటనే బాలు బయోపిక్ మొదలు పెడతానంటున్నాడు ఈయన. 

Follow Us:
Download App:
  • android
  • ios