గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కోలుకోవాలని అభిమానులు చేసిన పూజలు ఫలిస్తున్నాయి. ఆయన ఆరోగ్యం మెల్లమెల్లగా రికవరీ అవుతోంది. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వెల్లడించింది. వెంటిలేటర్‌, ఎక్మో సాయంతో ఐసీయూలో చికిత్సపొందుతున్నారని తెలిపింది. ఈ మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనురాధ భాస్కరన్‌ బులిటెన్‌ విడుదల చేశారు. 

బాలసుబ్రహ్మణ్యం స్పృహలోకి వచ్చారని, వైద్యానికి స్పందిస్తున్నారని బులిటెన్‌లో పేర్కొన్నారు. బాలు ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ల టీమ్ నిరంతరం సునిశితంగా పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఆయన  స్పృహలోకి వచ్చి, ట్రీట్మెంట్ కు రెస్పాండ్ అవుతున్నారనే వార్త ఆయన అభిమానులను ఆనందరం కలిగిస్తోంది. 

అలాగే ఈయన ఆరోగ్యం గురించి తరుచూ ఎప్పటికప్పుడు ఆయన తనయుడు చరణ్ కూడా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎంజిఎం హాస్పిటల్ తాజా హెల్త్ బులెటన్ విడుదల చేసింది. అందులో ఎస్పీబీ ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారని.. అయితే చికిత్సకు స్పందిస్తున్నాని తెలిపారు.

 
ఈ నెల మొదటివారంలో కరోనా బారిన పడటంతో బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆయన కోలుకొని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమానులు, ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు.