Asianet News TeluguAsianet News Telugu

విజయ్ కొట్టడం - సూర్య లేవడం..సాధ్యమేనా?

కోలీవుడ్ స్టార్ హీరోలు టాలీవుడ్ లో కూడా ఒక మినిమమ్ మార్కెట్ ను సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా ఎలా ఉన్నా కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే ఇక్కడి స్టార్ హీరోల సినిమాలకు పోటీ ఇస్తుంటారు. ఇక మన హీరోలు తమిళ్ లో క్లిక్ అవ్వడం అనేది చాలా రేర్. 

south box office fight vijay devarakonda vs suriya
Author
Hyderabad, First Published Mar 27, 2019, 3:25 PM IST

కోలీవుడ్ స్టార్ హీరోలు టాలీవుడ్ లో కూడా ఒక మినిమమ్ మార్కెట్ ను సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా ఎలా ఉన్నా కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే ఇక్కడి స్టార్ హీరోల సినిమాలకు పోటీ ఇస్తుంటారు. ఇక మన హీరోలు తమిళ్ లో క్లిక్ అవ్వడం అనేది చాలా రేర్. 

ఇకపోతే ఇప్పుడు ఇద్దరు హీరోలు విజయం కోసం పరభాషా ఇండస్ట్రీల్లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వారే విజయ్ దేవరకొండ - సూర్య. ఇద్దరు కూడా సొంత భాషలో బాగానే రాణిస్తున్నారు.  నెక్స్ట్ వీరిద్దరి సినిమాలు ఒకేసారి రిలీజ్ కాబోతున్నాయి. సూర్య NGK - విజయ్ డియర్ కామ్రేడ్ సినిమాలు మే31న రాబోతున్నాయి. 

అయితే నోటా సినిమాతో ఇదివరకే కోలీవుడ్ లోకి దిగిన విజయ్ సక్సెస్ అందుకోలేదు. ఈ సారి ఎలాగైనా బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టాలని డియర్ కామ్రేడ్ ను అక్కడ రిలీజ్ చేయబోతున్నాడు. ఇక సూర్య NGK సినిమాతో తమిళ్ తో పాటు తెలుగులో కూడా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. కానీ టాలీవుడ్ లో సూర్య సక్సెస్ రేట్ బాగా పడిపోయింది. 

ఇప్పుడు ఫోర్స్ గా లేచి మళ్ళీ తెలుగు మార్కెట్ లో నిలదొక్కుకోవాలని అనుకుంటున్నాడు. సూర్య - విజయ్ ల రెండు సినిమాలు ఒకేసారి వస్తుండడంతో బాక్స్ ఆఫీస్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకరి భాషలో మరో హీరో స్ట్రాంగ్ పోటీని ఇస్తారు. పరభాషలో ఇద్దరు హీరోలు పై చేయి సాధించడం కష్టమే..మరి ఏ సినిమా సౌత్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందో చూడాలి.  

Follow Us:
Download App:
  • android
  • ios