ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి తరువాత మరొకరు ప్రముఖ నటులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తాజాగా టాలీవుడ్  తో పాటు... మాలీవుడ్, కోలీవుడ్ లలో విలన్ గా పాపులర్ అయిన కజాన్ ఖాన్ కన్ను మూశారు. 


నార్త్ నుంచి సౌత్ వరకూ.. ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈరెండు మూడునెలల్లోనే ప్రముఖులు చాలా మంది కన్నుమూశారు. సీనియర్ నటుడు శరత్ బాబు , మ్యూజిక్ డైరెక్టర్ రాజ్, ఆర్ఆర్ఆర్‍ విలన్ గా నటించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్ సన్ తో పాటు కన్నడ నటుడు నితిన్ గోపీ, బాలీవుడ్‌లో ఆదిత్య సింగ్ రాజ్ పుత్, సీరియల్ నటి వైష్ణవి ఉపాధ్యాయ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది స్టార్లు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. 

ఈక్రమంలోనే మరోక నటుడు కన్నుమూశారు. మలయాళంతో పాటు.. తెలుగు, తమిళ భాషల్లో విలన్ గా ప్రాముఖ్యత సాధించినటువంటి ప్రముఖ నటుడు, విలన్ పాత్రలకు పెట్టింది పేరైన కజాన్ ఖాన్ మరణించారు. గుండెపోటుతో ఈ నెల 12న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో మాలీవుడ్ లో విషాద చాయలు అలముకున్నాయి. 

దక్షిణాదిన అన్ని భాషల్లో నటించారు కాజాన్ ఖాన్.. అయితే ఆయ‌న న‌టుడిగా ప‌రిచ‌య‌మైంది మాత్రం ప్ర‌భు హీరోగా న‌టించిన `సెంత‌మిళ్ ప‌ట్టు సినిమాతోనే . 1992లో విడుద‌లైన ఈ సినిమాని తెలుగులో.. రాజ‌శేఖ‌ర్ హీరోగా అమ్మ కొడుకు పేరుతో రీమేక్ చేశారు. ఆ త‌రువాత చాలా వ‌ర‌కు త‌మిళ‌, తెలుగు, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ చిత్రాల‌తో పాటు ఓ ఇంగ్లీష్ మూవీలోనూ న‌టించారు. న‌టుడిగా నాలుగు భాష‌ల్లో 50కి పైగా సినిమాలు చేశారు. 

గంధ‌ర్వ‌, సీఐడీ మూసా, ది కింగ్‌, వ‌ర్ణప‌కిత్‌, మాయా మోహిని, రాజాధిరాజా వంటి సినిమాలు ఆయ‌న‌కు మంచి గుర్తింపుని తెచ్చి పెట్టాయి. తెలుగులో `సూప‌ర్ పోలీస్‌`, అధిప‌తి వంటి త‌దిత‌ర సినిమాల్లో క‌జాన్ ఖాన్ విలన్ గా నటించి మెప్పించారు. కాజాన్ ఖాన్ మృతి పట్ల ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపంప్రకటిస్తున్నారు.మలయాళంతో పాటు సౌత్ లోని ప్రముఖ నటుడు కజాన్ ఖాన్ కు నివాళి అర్పిస్తున్నారు.