రజినీకాంత్ రెండో కూతురు సౌందర్య రజినీకాంత్ మరో మూడు రోజుల్లో వివాహం చేసుకోబోతుంది. ఇప్పటికే రజినీకాంత్ ఇంట్లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. రజినీకాంత్ కొందరు ప్రముఖులను స్వయంగా కలుసుకొని మరీ పెళ్లి శుభలేఖలను అందిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా.. సౌందర్య తనకు కాబోయే భర్తతో తీసుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త విషాగన్ వనంగమూడిని ఆమె పెళ్లి చేసుకోబోతుంది. వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటో చూసిన నెటిజన్లు ఈ జంటకి శుభాకాంక్షలు చెబుతున్నారు.

వీరి బంధం చిరకాలం నిలవాలంటూ కోరుకుంటున్నారు. సౌందర్యకి ఇది రెండో పెళ్లి. గతంలో అశ్విన్ కుమార్ ని వివాహం చేసుకున్న ఈమె అతడితో విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్న రెండేళ్లకు ఇప్పుడు విషాగన్ ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది.