సలార్ విడుదలకు సిద్ధం అవుతుంది. టీజర్, ట్రైలర్ విడుదల చేశారు. సాంగ్స్ మాత్రమే ఒక్కటి కూడా రిలీజ్ చేయలేదు. నేడు 'సూరీడే' అనే ఎమోషనల్ సాంగ్ విడుదల చేశారు.
సలార్ మూవీతో ప్రభాస్ బాక్సాఫీస్ షేక్ చేస్తాడని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. డిసెంబర్ 22న వరల్డ్ మూవీ విడుదలవుతుంది. ట్రైలర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే రికార్డు వ్యూస్ రాబట్టింది. కెజిఎఫ్ 2 ట్రైలర్ రికార్డు సైతం బద్దలు కొట్టింది. సలార్ నుండి రెండో ట్రైలర్ కూడా విడుదల కానుందని సమాచారం.
సలార్ పై అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు. రికార్డు స్థాయిలో సలార్ బిజినెస్ చేసింది. పెట్టుబడి రాబట్టాలంటే ఓపెనింగ్స్ భారీగా ఉండాలి. కేవలం తెలుగు రాష్ట్రాల వరకు రూ. 175 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. అంటే రూ. 300 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. సలార్ మూవీలో సాంగ్స్ ఉన్నాయా లేవా? అనే సందేహాలు ఉన్నాయి. ప్రభాస్ గత చిత్రాల వలే ఐదారు సాంగ్స్ ఉండే అవకాశం అసలు లేదు.
ఎట్టకేలకు ఓ సాంగ్ విడుదల చేశారు. సలార్ ఇద్దరు మిత్రుల కథ అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇక తన స్నేహితుడి కోసం ప్రభాస్ ఎంతగా తెగిస్తాడో, మిత్రుడిని ఎలా కంటికి రెప్పలా కాపాడతాడో తెలియజేస్తూ 'సూరీడే' అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ చాలా ఎమోషనల్ గా సాగింది. సలార్ లో భీభత్సమైన హింసతో పాటు, బలమైన భావోద్వేగాలు కూడా ఉంటాయని పాటను బట్టి అర్థం అవుతుంది.
రవి బసృర్ స్వరపరచగా, హరిణి వైతురి ఆలపించింది. కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ తెరకెక్కింది. విజయ్ కిరగందూర్ ఈ చిత్ర నిర్మాత. ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. జగపతిబాబు, బాబీ సింహ, టిను ఆనంద్, ఈశ్వరి రావు, గరుడ రామ్, జగపతి బాబు కీలక రోల్స్ చేస్తున్నారు.

