సోనూసూద్‌ అభిమానులకు సరదాని పంచారు. తన వర్కౌట్‌ వీడియోతో అదరగొట్టడమే కాదు చివరికి అందరు ఫూల్‌ అయ్యేలా చేసి కడుపుబ్బ నవ్వుకునేలా చేశారు. సోనూసూద్‌ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

రియల్‌ హీరో సోనూసూద్‌ నిత్యం సేవా కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఎక్కడ చూసినా ఆయన వారికి హెల్ప్ చేశారు, వీరికి హెల్ప్ చేశారంటూ వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ సోనూసూద్‌ అభిమానులకు సరదాని పంచారు. తన వర్కౌట్‌ వీడియోతో అదరగొట్టడమే కాదు చివరికి అందరు ఫూల్‌ అయ్యేలా చేసి కడుపుబ్బ నవ్వుకునేలా చేశారు. సోనూసూద్‌ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

మరి ఇంతకి సోనూసూద్‌ చేసిన ఈ ఫన్నీ వీడియో ఏంటంటే, రెండు డంబెల్స్ పై సోనూసూద్‌ వాల్‌కి కాళ్లు పైకెత్తి తలక్రిందులుగా వర్కౌట్‌ చేస్తున్నారు. రెండు కాళ్లని పైకెత్తి మరీ చేసిన వర్కౌట్‌, అలాగే ఒక్కచేతిపై నిలబడి మరీ ఆయన తలక్రిందులుగా నిలబడటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సోనూసూద్‌ వర్కౌట్‌లోనూ ఇంతగా కష్టపడుతున్నాడా? ఇదొక రేర్‌ ఫీట్‌ అంటూ అభిమానులు సంబరపడుతున్నాయి. దీన్ని పక్కన ఓ వ్యక్తి చైర్‌ పై కూర్చొని సోనూసూద్‌ని గమనిస్తున్నారు. 

చివరికి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు సోనూసూద్‌. ఫ్లోర్‌పై నుంచి లేచి తాపీగా వెళ్లిపోయాడు. చైర్‌ పై కూర్చొన్న వ్యక్తి కూడా ఫ్లోర్‌ పై నుంచి వెళ్లిపోయాడు. ఈ ట్విస్ట్ కి అంతా షాక్‌ అవుతున్నారు. సోనూసూద్‌ ఫ్లోర్‌ పైనే ఇదంతా చేశారు. కష్టపడి వర్కౌట్‌ చేస్తున్నట్టుగా మొదట చూపించి ఆ తర్వాత సింపుల్‌గా ట్విస్ట్ ఇవ్వడం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది. కడుపుబ్బ నవ్వుకునేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. సోనూసూద్‌లోని ఈ ఫన్నీ యాంగిల్‌కి అంతా ఫిదా అవుతున్నారు. 

Scroll to load tweet…

కరోనా ఫస్ట్ వేవ్‌, సెకండ్‌ వేవ్‌లో అవిశ్రాంతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు సోనూసూద్‌. ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. ఎంతో మందికి భోజనం పెట్టాడు. కరోనా పేషెంట్లకి ఆక్సిజన్‌ అందించారు. మొత్తంగా నిస్వార్థ సేవకి జనం రియల్‌ హీరో అంటూ పిలుచుకునేలా చేశారు. మరోవైపు నటుడిగానూ ఆయన బిజీగా ఉన్నారు. ప్రస్తుతం `ఆచార్య`, హిందీలో `పృథ్వీరాజ్‌`, తమిళంలో `తమిళరాసన్‌` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు కరోనా సేవకిగానూ దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించడంతో కమర్షియల్‌ యాడ్స్ కిప్పుడు సోనూసూడ్‌ బెస్ట్ ఆప్షన్‌ అవుతున్నారు.