Asianet News TeluguAsianet News Telugu

ఐటీ దాడులపై సోనూసూద్‌ సెటైర్లు.. ఢిల్లీ సీఎం మద్దతు

సోనూ సూద్‌ సేవకి ఎంతో మంది దాతలు ఆయనకు స్వచ్ఛందంగా విరాళాలు కూడా ఇచ్చారు. అయితే వాటిని క్రమంగా ఖర్చు పెట్టేందుకు ప్లాన్‌ చేశారట సోనూసూద్‌. కానీ ఇంతలో ఐటీ దాడులు ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తే, రియల్‌ హీరోపై ఐటీ దాడులు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

sonu sood tweet on IT raids setires
Author
Hyderabad, First Published Sep 20, 2021, 11:48 AM IST

కరోనా కాలంలో నటుడు సోనూసూద్‌లోని సేవకుడు బయటకు వచ్చాడు. అప్పటి వరకు విలన్‌(తెరపై)గా చూసిన జనం కరోనా సమయంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలతో ఆయనలో హీరోని చూడటం స్టార్ట్ చేశారు. గతేడాది నుంచి ఇప్పటి ఎంతో మంది పేదలను ఆదుకున్నారు సోనూసూద్‌. వెలకట్టలేనంత సేవ కార్యక్రమాలు చేశారు. ఇంకా చేస్తున్నారు. సోనూ సూద్‌ సేవకి ఎంతో మంది దాతలు ఆయనకు స్వచ్ఛందంగా విరాళాలు కూడా ఇచ్చారు. 

అయితే వాటిని క్రమంగా ఖర్చు పెట్టేందుకు ప్లాన్‌ చేశారట సోనూసూద్‌. కానీ ఇంతలో ఐటీ దాడులు ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తే, రియల్‌ హీరోపై ఐటీ దాడులు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆయనకు సంబంధించిన అన్ని ఆఫీసులు, ఫౌండేషన్‌పై కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో రూ. 20కోట్లకుపైగా ట్యాక్స్ ఎగ్గొట్టారని ఐటీ అధికారులు వెల్లడించారు. అయితే ఈ దాడులపై సర్వత్రా విమర్శలొచ్చాయి. సోనూసూద్‌కి అభిమానులు, నెటిజన్లు మద్దతుగా నిలిచారు. 

ఈ నేపథ్యంలో తాజాగా సోనూసూద్‌ స్పందించారు. ఐటీ దాడుల అనంతరం ఆయన తొలిసారి ట్విట్టర్‌ ద్వారా దీనిపై పోస్ట్ పెట్టాడు. ఈసందర్భంగా ఐటీ అధికారులపై సెటైర్లు వేశారు. నాలుగు రోజులు అతిథులతో గడిపానని ఐటీ అధికారులను ఉద్దేశించి అన్నారు. ప్రతి భారతీయుడి ప్రార్థనలు ప్రభావం చూపుతాయని, కష్టమైన రోడ్లపై కూడా సాఫీగా ప్రయాణం సాగుతుందని అన్నారు. ప్రతి పొదుపు చేసే ప్రతీ రూపాయి పేదల విలువైన జీవితాలను కాపాడటానికే అని తెలిపారు. 

`భారత ప్రజలకు సేవ చేయాలని నాకు నేను ప్రతిజ్ఙ చేసుకున్నా. నా ఫౌండేషన్‌లోని ప్రతి రూపాయి నిరుపేదల విలువైన జీవితాల కోసం పొదుపు చేసిందే. అంతేకాకుండా మానవతా కారణాలతో కొన్ని బ్రాండ్లను సైతం ప్రోత్సహించాను. గత నాలుగు రోజులుగా నేను నా అతిథుల (ఐటీ అధికారుల)తో బిజీగా ఉన్నాను. అందుకే మీ సేవలో ఉండలేకపోయా. నేను మళ్లీ తిరిగొచ్చాను` అని ట్విట్టర్‌ ద్వారా ఓ పోస్ట్ పెట్టాడు సోనూసూద్‌. 

ఇదిలా ఉంటే దీనిపై ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌ స్పందించారు. సోనూసూద్‌కి మద్దతుగా ట్వీట్‌ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios