లాక్‌డౌన్ రియల్ హీరో సోనూ సూద్ వివాదంలో ఇరుక్కున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆయన ట్రోల్స్ కి గురయ్యారు. మహాశివరాత్రి సందర్భంగా ఆయన పెట్టిన పోస్టే ఇప్పుడు విమర్శలకు కారణమైంది. మరి ఇంతకు సోనూ సూద్ ఏం చేశాడంటే..
లాక్‌డౌన్ రియల్ హీరో సోనూ సూద్ వివాదంలో ఇరుక్కున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆయన ట్రోల్స్ కి గురయ్యారు. మహాశివరాత్రి సందర్భంగా ఆయన పెట్టిన పోస్టే ఇప్పుడు విమర్శలకు కారణమైంది. మరి ఇంతకు సోనూ సూద్ ఏం చేశాడంటే.. మహాశివరాత్రి సందర్బంగా అంతా శివుడి ఫోటోని పంచుకుంటూ విషెస్ తెలియజేసిన విషయం తెలిసిందే. అయితే ఇది సోనూ సూద్‌కి నచ్చలేదు. కానీ అందులో కూడా మంచిని వెతికారాయన. శివుడి ఫోటోలు షేర్ చేసేబదులు, ఎవరికైనా సహాయం చేయడం ద్వారా మహాశివరాత్రి జరుపుకోండి అని ట్వీట్ చేశారు.
దీంతో కొందరు నెటిజన్లు దీన్ని నెగటివ్‌గా అర్థం చేసుకున్నారు. సోనూ సూద్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. `#whothehellareusonusood`అంటూ ట్రోల్ చేస్తున్నారు. మత విద్వేషాలను ఉసిగొల్పేలా కామెంట్ చేస్తున్నారు. హిందీ మతాన్ని కించపరుస్తున్నారని, భక్తిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, హిందూ వ్యతిరేకి అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. మరికొందరు సోనూ సూద్‌కి మద్దతుగా నిలుస్తున్నారు. నిజాయితీగల ఇండియన్ ఐడల్ అంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మొత్తానికి ఇప్పుడు `ఐ సపోర్ట్ సోనూసూద్`, `హుది హెల్ ఆర్ యుసోనూ సూద్` యాష్ ట్యాగ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా కష్టకాలంలో పేదలను, వలసకార్మికులను ఆదుకుని రియల్ హీరోగా సోనూ సూద్ అవతరించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి అనేక కార్యక్రమాలతో నిర్మాణాత్మకంగా తన సేవను కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఆన్‌లైన్ ట్రోలింగ్‌కు సోనూసూద్ గతంలోనే గట్టి కౌంటర్ ఇచ్చారు. మానవత్వంతో స్పందించి, సాయం చేయడమే తన విధి, సామాన్యుడికి మాత్రమే జవాబుదారీగా ఉంటానని క్లారిటీ ఇచ్చారు. ఈ ట్రోలింగ్ వెనుక నేపథ్యం, ఎవరున్నారో తనకు తెలుసు కాబట్టి, వీటికి స్పందించాల్సిన అవసరం లేదని ఒక ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు. అంతేకాదు నెగిటివిటీ ట్రోలింగ్ చేసేవారి డీఎన్‌ఏలోనే ఉంది .. కానీ నలుగురికీ ఉపయోగపడే పనిచేసుకుంటూ పోవడమే తన పని అని సోనూ సూద్ స్పష్టం చేశారు.
నటుడిగా ప్రస్తుతం సోనూ సూద్ తెలుగులో `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. చిరంజీవి, రామ్‌చరణ్ ప్రధాన పాత్రధారులుగా కాజల్ హీరోయిన్‌గా కొరటాల శివ చిత్రంలో నటించారు. దీంతోపాటు అక్షయ్ కుమార్ `పృథ్వీరాజ్` చిత్రంలో చంద్ బర్దాయిగా కనిపించనున్నారు. మానుషి చిల్లార్, సంజయ్ దత్ నటించిన ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ నవంబర్ 5న విడుదల కానుంది.
