రియల్ హీరో సోనూ సూద్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్ వచ్చి చేరింది.  ఓ ప్రముఖ యూకే సంస్థ చేసిన సర్వేలో టాప్ 50లో సోనూ సూద్ కి స్థానం దక్కింది. ఆసియాలోని ప్రముఖ తారల సరసన సోనూ నిలిచాడు. 

ఇంతకీ విషయం ఏంటంటే...యూకేకు చెందిన ఓ సంస్థ ఈ ఏడాది మంచిపనులు చేసినవారు. చాలా పాజిటివ్ పేరు తెచ్చుకున్నవారు, మంచి పనులకోసం హద్దులు దాటి మరీ దాతృత్వాన్ని చాటుకున్నవారు అనే పేరుతో ఓ సర్వే నిర్వహించింది. ఆ సర్వే వివరాలతో ఓ లిస్టు ను తయారు చేసింది. ఆ జాబితాలో టాప్ 50 మందిలో సోనూ సూద్ పేరు కూడా ఉంది. 

కరోనా కాలంలో సోనూ సూద్ ఎందరో వలస కూలీలకు తనవంతు సహాయం చేశాడు. వారి కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి మరీ వారికి ఇళ్ళకు చేర్చాడు. అంతేకాకుండా ఇతర దేశాలలో ఉన్నా వారికోసం ప్రత్యే ఫ్లైట్లను కూడా పెట్టించాడు. దాంతో దేశంలో రియల్ హీరోగా పేరు పొందాడు. అంతేకాకుండా కరోనా కారణంగా నిరుద్యోగులైన వారికి ఎందరికో ఉద్యోగ అవకాశాలు ఇప్పించాడు. 

అయితే కరోనా సమయంలో తాను చేసిన దానిపై సోనూ మాట్లాడుతూ.. ‘మహమ్మారి విజృంభణతో నేను ఒకటి అర్థం చేసుకున్నాను. నా దేశ ప్రజలకు సహాయం చేయడం నా కర్తవ్యంగా భావించాను. వారి గురించి ఆలోచించడం నా తుది శ్వాస వరకు ఆపన’ని సోనూ అన్నాడు. 

ఈ ఏడాది దేశంలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సోనూ సంపాదించుకున్నాడు. ది రియల్ హీరో అంటూ ప్రజలు అతడిని మెచ్చుకున్నారు. అంతేకాకుండా పంజాబ్ ప్రభుత్వం రాష్ట్ర యూత్ ఐకానిక్‌గా సోనూ సూద్‌ను నియమించింది.