Asianet News TeluguAsianet News Telugu

మ‌ట‌న్ షాపుకు తన పేరు…సోనూసూద్ రియాక్షన్ !

తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్‌లో ఓ వ్య‌క్తి మ‌ట‌న్ దుకాణానికి  సోనూసూద్ పేరు పెట్టాడు. సోసూ నిర్వహిస్తున్న ట్రస్ట్ కు విరాళంగా అందించాలనే ఉద్దేశంతోనే ఆయన పేరు పెట్టారు. 

Sonu sood reacts to Mutton shop named after him jsp
Author
Hyderabad, First Published May 31, 2021, 10:09 AM IST

కొవిడ్ ఫ‌స్ట్ వేవ్ నుంచి అడిగిన వారికి లేద‌న‌కుండా సాయం చేస్తూనే ఉన్నారు సోనూసూద్‌. సెకండ్ వేవ్‌లో ఆయ‌న సేవ‌లు మ‌రింత విస్తృత‌మ‌య్యాయి. ఆక్సిజ‌న్  ప్లాంట్లు నెల‌కొల్పి,  దేశ‌మంత‌టా ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు ఉచితంగా అందిస్తూ ప్రాణ‌దాత అనిపించుకుంటున్నారు. కరోనా కష్ట కాలంలో ఎందరికో సాయం చేసి దేవుడిగా మారాడు నటుడు సోనూసూద్. లాక్ డౌన్ సమయంలో నిరుపేదలకు సాయం చేస్తూ రియల్ హీరోగా మారాడు. 

కొవిడ్ సెకండ్ వేవ్‌లో సైతం సోనూసూద్ కొవిడ్ రోగులకు ఆక్సిజన్ కాన్సంట్రేట‌ర్లు అంద‌జేయ‌డం, ఇత‌ర అవ‌స‌ర‌మైన మందులు, ప‌రిక‌రాల‌ను అంద‌జేస్తున్నారు. అడిగిన వారికి వెంటనే సాయం అందిస్తున్నారు. జూన్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు ఆక్సిజ‌న్ ప్లాంట్‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా ఇటీవ‌లే తెలిపాడు.

దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సోనూ సూద్ కు అభిమానులు పెరిగారు. తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్‌లో ఓ వ్య‌క్తి మ‌ట‌న్ దుకాణానికి  సోనూసూద్ పేరు పెట్టాడు. సోసూ నిర్వహిస్తున్న ట్రస్ట్ కు విరాళంగా అందించాలనే ఉద్దేశంతోనే ఆయన పేరు పెట్టారు. అయితే, ఈ విషయం సోనూసూద్ వరకు వెళ్లింది. దీనిపై ట్విట్టర్ లో ఆయ‌న స్పందించారు. తాను శాఖాహారిని.. అటువంటిది తన పేరు మ‌ట‌న్ షాపు? అని చ‌మత్క‌రించాడు. శాఖాహారం తెరవడానికి తాను అతనికి సహాయం చేయగలనా? అంటూ సోనూ ట్వీట్ చేశాడు.

ఇక ఒకప్పుడు త‌న‌ని తిరస్క‌రించిన ఓ ప్ర‌ముఖ మ్యాగ‌జైన్ ఇప్పుడు త‌న ఫొటోని ప్ర‌చురించ‌డంపై ఆనందాన్ని వ్య‌క్తం చేశారు న‌టుడు సోనూసూద్‌. సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా ఆ సంస్థ‌కి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ‘గతంలో స్టార్ డ‌స్ట్ ఆడిష‌న్ కోసం కొన్ని ఫొటోల్ని పంపించాను. న‌న్ను తిరస్క‌రించారు. కానీ, ఇప్పుడు అదే మ్యాగ‌జైన్‌పై నా ఫొటో ప్ర‌చురించినందుకు వారికి కృత‌జ్ఞ‌తలు చెప్పాల‌నుకుంటున్నాను’  అని ట్వీట్ చేశారు సోనూ. 2021 ఏప్రిల్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై సోనూ ఫొటోని ప్ర‌చురించి..   రియ‌ల్ హీరో సోనూ సూద్ అని కొనియాడింది స్టార్ డ‌స్ట్‌. ముంబ‌యి వేదిక‌గా 1971 నుంచి ప్ర‌చురిత‌మ‌వుతోంది స్టార్ డ‌స్ట్ మాస ప‌త్రిక‌.

Follow Us:
Download App:
  • android
  • ios