మరోవైపు ఇండియాలో అనేక చోట్ల ఆక్సిజన్‌ ప్లాంట్లని ఏర్పాటు చేస్తున్నారు సోనూ సూద్‌. దీంతోపాటు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గొప్ప కార్యాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. 

రియల్‌ హీరో సోనూ సూద్‌ నిత్యం సేవా కార్యక్రమాల్లో మునిగితేలుతున్నారు. ఆయన ఓ వైపు అత్యవసరంలో, ఆపదలో ఉన్న కరోనా రోగులకు ఆక్సిజన్‌ బెడ్స్, వెంటిలేటర్స్ వంటివి అందిస్తూ తన గొప్ప మనసుని చాటుకుంటున్న విషయం తెలిసిందే. అందుకే ఆయన రియల్‌ హీరో అయ్యారు. మరోవైపు కరోనాతో మరణించిన ఫ్యామిలీలో అనాథలైన పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు కృషి చేస్తున్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేయగా, కొన్ని రాష్టాలు అందుకు ముందుకొచ్చాయి. 

మరోవైపు ఇండియాలో అనేక చోట్ల ఆక్సిజన్‌ ప్లాంట్లని ఏర్పాటు చేస్తున్నారు సోనూ సూద్‌. దీంతోపాటు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గొప్ప కార్యాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఐఏఎస్‌ కావాలనే డ్రీమ్స్ ఉన్న వారికి అండగా నిలవబోతున్నారు. అందులో భాగంగా `సంభవం` పేరుతో వారికి ఆర్థికంగా సహకరించేందుకు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని సోనూ సూద్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. 

`ఐఏఎస్‌ కోసం సిద్ధం కావాలనుకుంటున్నారా? మీ బాధ్యత మేం తీసుకుంటాం. `సంభవం` ప్రారంభం గురించి ప్రకటిస్తున్నందుకు థ్రిల్లింగ్‌గా ఉంది` అని ట్వీట్‌ చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు జూన్‌ 30లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ లింక్‌లను సోనూ సూద్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి మంచి స్పందన లభిస్తుందని తెలుస్తుంది.

Scroll to load tweet…