Artiste Trailer: మర్డర్స్ జరిగాక విలన్స్ కోసం వెతకడం రెగ్యూలర్ స్టోరీ. కానీ విలన్ ఎవరో చెప్పి మర్డర్స్ చేయడం `ఆర్టిస్ట్` స్టోరీ. మరి ఆ స్టోరీ ఏంటో తెలుసుకోండి.
Artiste Trailer: థ్రిల్లర్ సినిమాలు ఇటీవల చాలా వస్తున్నాయి. చాలా వరకు మెప్పిస్తున్నాయి. సరికొత్త కంటెంట్‌తో, ఎంగేజింగ్ థ్రిల్లర్స్ మంచి ఆదరణ ఉంటుంది. తాజాగా `ఆర్టిస్ట్` పేరుతో మరో థ్రిల్లర్ వస్తుంది. అయితే ఇది సైకో థ్రిల్లర్. కరుడుగట్టిన ఇద్దరు సైకోల జర్నీని తెలియజేసే థ్రిల్లర్. `ఆర్టిస్ట్` ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటుంది.
ఇందులో హీరోయిన్ లవర్ హీరో సైకోలా బిహేవ్ చేస్తాడు. సైకోలా అమ్మాయిలను చంపేస్తుంటాడు. మరోవైపు విలన్ పెద్ద సైకో. నీతులు చెబుతూ సైకోలా చంపేస్తుంటారు. వీరిద్దరి మధ్య నలిగిపోయేది, బలయ్యేది అమ్మాయిలు. మరి ఆ కథేంటనేది తెలియాలంటే `ఆర్టిస్ట్` మూవీ చూడాల్సిందే.
`బిగ్ బాస్ తెలుగు 8` ఫేమ్ సోనియా ఆకుల నటించిన `ఆర్టిస్ట్` ట్రైలర్ ఎలా ఉందంటే?
మంగళవారం విడుదలైన `ఆర్టిస్ట్` ట్రైలర్ ఆకట్టుకుంటుంది. సరికొత్తగా ఉంది. సినిమాలో పాత్రలు, అలాగే బీజీఎం అదిరిపోయింది. పెద్ద సినిమాల రేంజ్‌లో ఉంది. కంటెంట్ క్వాలిటీ బాగుంది. టెక్నీకల్‌గానూ అదిరిపోయింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది.
ఇక ఇందులో బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటించారు. ప్రభాకర్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఎస్ జేకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు.
విలన్ ఎవరో ముందే చూపించబోతున్న `ఆర్టిస్ట్` మూవీ..
ట్రైలర్ ఈవెంట్‌లో డైరెక్టర్ రతన్ రిషి మాట్లాడుతూ , `ఆర్టిస్ట్`.. ఇదొక సైకో థ్రిల్లర్ మూవీ. ఇందులో సస్పెన్స్, భయం, కామెడీ, రొమాన్స్ వంటి అన్ని అంశాలుంటాయి. ఒక ఎమోషన్ మీద కథ వెళ్తుంటుంది. సినిమా చివరి 20 నిమిషాలు హై ఉంటుంది. చివరకు ఒక మంచి ఫీల్ తో ప్రేక్షకులు థియేటర్స్ నుంచి బయటకు వెళ్తారు. కథలోని ఎమోషన్ కు తగినట్లే సురేష్ బొబ్బిలి ఒక కొత్త బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేశారు.
ట్రైలర్ లో వయలెన్స్ ఎక్కువగా ఉందని మీకు అనిపించవచ్చు. మూవీలో ఇంత వయలెన్స్ లేదని మా టీమ్ అన్నారు. సైకో థ్రిల్లర్స్ అంటే హత్య జరిగిన తర్వాత కిల్లర్ ఎవరనేది వెతుక్కుంటూ కథ సాగుతుంది. కానీ మా మూవీలో విలన్ ఎవరో చెప్పే మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేశాం. కథ మీద అంత నమ్మకంతో సినిమా చేశా` అని తెలిపారు.

మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్‌లో `ఆర్టిస్ట్` మూవీ రిలీజ్..
ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము మాట్లాడుతూ, `ఒక ఫిల్మ్ చేసి రిలీజ్ కు తీసుకురావడం సులువైన విషయం కాదు. ఎంతోమంది కృషి దీని వెనక ఉంటుంది. కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలనేది నా కోరిక. అందుకే మా సంస్థలో న్యూ కమర్స్ తో మూవీస్ చేస్తున్నాం. డైరెక్టర్ రతన్ రిషి "ఆర్టిస్ట్" మూవీతో మంచి పేరు తెచ్చుకుంటాడు.
అలాగే హీరో సంతోష్, హీరోయిన్ క్రిషేకకు కూడా పేరొస్తుంది. మా మూవీ సాంగ్స్ టీ సిరీస్ ద్వారా రిలీజై ఆదరణ పొందుతున్నాయి. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 21న మా మూవీని రిలీజ్ చేస్తున్నాం. వాళ్లకు సినిమా నచ్చి రిలీజ్ చేస్తామని చెప్పడం సంతోషంగా ఉంది` అని చెప్పారు.
హీరో సంతోష్ కల్వచెర్ల మాట్లాడుతూ, `ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ మూవీని రూపొందించారు మా డైరెక్టర్. సొసైటీలో ఉన్న ఒక ప్రాబ్లమ్ ను చూపించాడు. ఆ సమస్య పాతదే అయినా కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. సినిమా చూశాను. ఆ కాన్ఫిడెన్స్ తో చెబుతున్నా. "ఆర్టిస్ట్" సినిమా చూశాక ఎవరూ రొటీన్ గా ఉందని అనరు. స్క్రీన్ ప్లే కొత్తగా ఉందని అంటారు` అని తెలిపారు.
