ప్రస్తుతం సోషల్ మీడియా అంతా రానా, అతని ప్రేయసి ఫోటోలే హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఇన్నాళ్లు పెళ్లి మాట ఎత్తితేనే ఆమడ దూరం పరిగెత్తిన రానా, సడన్‌గా అందరికీ షాక్‌ ఇస్తూ తనకు కాబోయే భార్యను పరిచయం చేయటంతో అంతా షాక్‌ అయ్యారు. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌ నుంచి మెగాస్టార్‌ మొదలుకొని తారలంతా రానాకు విషెస్ చెప్పారు. రానా బాలీవుడ్‌కు కూడా సుపరిచితుడే కావటంతో ఆ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు స్పందిస్తున్నారు.

బాలీవుడ్‌ హాట్ బ్యూటీ సోనమ్‌ కపూర్‌.. రానా, మిహికాలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. రానా, మై లవ్లీ మిహికా మీకు శుభాకాంక్షలు. మీ జంట అద్భుతంగా ఉంటుంది. మా కుటుంబం లోకి నీకు స్వాగతం రానా` అంటూ ట్వీట్ చేసింది సోనమ్‌. సోనమ్‌, మిహికాలు చాలా కాలంగా స్నేహితురాళ్లు. గతంలో వీరిద్దరు కలిసి పలు వేడుకల్లో సందడి చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

రానా తన ప్రేయసిని పరిచయంచేసిన దగ్గర నుంచి ఆమె ఎవరో తెలుసుకునేందుకు అభిమానులు అంతర్జాలాన్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో రానా, మిహికాల పేర్లు ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. గతంలో సోనమ్‌ పుట్టిన రోజు సందర్భంగా మిహికా షేర్‌ చేసిన ఫోటోను రానా అభిమానులు తెగ వైరల్‌ చేస్తున్నారు. సొంతంగా వ్యాపార రంగంలో ఎదుగుతున్న మిహికా బాలీవుడ్‌ లో పలువురు సెలబ్రిటీలకు అత్యంత సన్నిహితురాలని తెలుస్తోంది.
Did you know Rana Daggubati's fiance Miheeka Bajaj is connected to ...